Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల-hyderabad ts govt released rythu bharosa funds to farmers five acres above ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Bandaru Satyaprasad HT Telugu
May 06, 2024 07:48 PM IST

Rythu Bharosa Funds : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసింది. రైతుల అకౌంట్లలో నగదు జమ అవుతున్నాయి.

రైతు భరోసా నిధులు విడుదల
రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa Funds : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. దీంతో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతున్నాయి. ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. రైతు భరోసా కింద రూ.2 వేల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

రూ.2 వేల కోట్లు విడుదల!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయశాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతులకు నిధులు జమ చేయంగా, సోమవారం నుంచి ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రైతు భరోసా నిధుల విడుదల కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకంగా మారింది.

రైతు భరోసాపై మాటల యుద్ధం

రైతు భరోసా నిధులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మే 9వ తేదీలోపు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే సీఎం ముక్కు నేలకు రాస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. నిధులు విడుదలైతే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కనీసం బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు రూ. 10 వేలు కూడా ఖాతాల్లో వేయలేదని బీఆర్ఎస్... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా సమయానికి నిధులు పడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు ఆగిపోయిందని కేసీఆర్ విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్, బీఆర్ఎస్ విమర్శల వేగం పెంచడంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇచ్చారు. మే 9లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తాజాగా ఈసీ అనుమతి లభించడంతో రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

పంట నష్టం నిధులు విడుదల

తెలంగాణలో అకాల వర్షాలు, కరవు పరిస్థితులతో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం నిధులును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. పంట నష్టం నిధులు విడుదలకు ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం