తెలుగు న్యూస్ / ఫోటో /
Rythu Bandhu Scheme Updates : రైతులకు గుడ్ న్యూస్... ఈ తేదీలోపు జమ కానున్న 'రైతుబంధు' డబ్బులు! తాజా అప్డేట్ ఇదే
- Telangana Rythu Bandhu Scheme Updates : రైతుబంధు (రైతు భరోసా) నిధుల జమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంట పెట్టుబడి సాయం రానివారికి మే 9వ తేదీలోపు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు. ఈ స్కీమ్ తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
- Telangana Rythu Bandhu Scheme Updates : రైతుబంధు (రైతు భరోసా) నిధుల జమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంట పెట్టుబడి సాయం రానివారికి మే 9వ తేదీలోపు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు. ఈ స్కీమ్ తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 6)
రైతుబంధు(రైతు భరోసా) నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన చేశారు. ఈ దఫా డబ్బులు రాని రైతులకు మే 8వ తేదీలోపు జమ చేస్తామని స్పష్టం చేశారు.
(2 / 6)
ఖమ్మంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. రాష్ట్రంలో మొత్తం 69 లక్షల మంది రైతులుంటే ఇప్పటికే 65 లక్షల మందికి రైతుభరోసా(రైతుబంధు) అందించామని వెల్లడించారు..
(3 / 6)
రైతుబంధు నిధులు రాకుండా మిగిలింది 4 లక్షల మంది రైతులే అని చెప్పారు. ఈ నెల 9 లోపు చివరి రైతు వరకు రైతుభరోసా(రైతుబంధు) నిధులను చెల్లిస్తామన్నారు.
(4 / 6)
మే 9వ తేదీలోపు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా రైతుబంధు నిధుల బకాయి ఉండదని స్పష్టం చేశారు. రైతుబంధు నిధులు ఇవ్వటం లేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
(5 / 6)
మరోసారి రుణమాఫీపై ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ తప్పుకుండా చేస్తామని ప్రకటించారు.
(6 / 6)
బీఆర్ఎస్ హయాంలో పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చింది.ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. ఇదే స్కీమ్ ను రైతు భరోసాగా అమలు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే కొత్త గైడ్ లైన్స్ కూడా రానున్నాయి. ఈ స్కీమ్ కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు