Krishna mukunda murari serial today: నిజం చెప్పిన కృష్ణ, మీరా బండారం బయట పెట్టిన మధు.. ప్లేటు ఫిరాయించిన ముకుంద-krishna mukunda murari serial today june 1st episode krishna tells madhu that meera is the surrogate mother ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial Today: నిజం చెప్పిన కృష్ణ, మీరా బండారం బయట పెట్టిన మధు.. ప్లేటు ఫిరాయించిన ముకుంద

Krishna mukunda murari serial today: నిజం చెప్పిన కృష్ణ, మీరా బండారం బయట పెట్టిన మధు.. ప్లేటు ఫిరాయించిన ముకుంద

Gunti Soundarya HT Telugu
Jun 01, 2024 08:07 AM IST

Krishna mukunda murari serial today june 1st episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సరోగసి ద్వారా మీరా కడుపులో తమ బిడ్డ పెరుగుతుందనే విషయం కృష్ణ మధుకు చెప్తుంది. ఈ విషయం మధు ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ జూన్ 1వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ జూన్ 1వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today june 1st episode: కృష్ణ హాస్పిటల్ రిపోర్ట్స్ చూసి భవానీ కుప్పకూలిపోతుంది. వెంటనే కోపంగా కిందకు వెళ్ళి కృష్ణ అని గట్టిగా అరుస్తుంది. కృష్ణ నేను చెప్పకుండానే మీ పెద్దత్తయ్యకు మొత్తం తెలిసిపోయింది. ఇన్నాళ్ళూ నిన్ను నెత్తిన పెట్టుకున్న మీ అత్త ఇప్పుడు విరుచుకుపడుతుందని ముకుంద సంబరపడుతుంది.

కృష్ణకి బిడ్డలు పుట్టరు

కృష్ణ ఏమైంది పెద్దత్తయ్య అంటే ఎంత మోసం చేశావే అని చెంప పగలగొడుతుంది భవానీ. ఏమైందని రేవతి అడిగితే రిపోర్ట్ ఇస్తుంది. ఆదర్శ్ వాటిని చూసి నవ్వుతాడు. పిన్నీ నీ కొడుకు చేసిన దానికి షాక్ లో ఉంటే నీ కోడలు చేసింది తెలిస్తే ఏమైపోతావో. తల్లి కాబోతుందని వారసుడిని ఇస్తుందని కృష్ణని నెత్తిన పెట్టుకున్నారు కదా.

అదేమీ లేదు అంతా ఉత్తిదే. కృష్ణ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇదంతా నిజమని. ఇప్పుడే కాదు ఈ జన్మకి కృష్ణకి బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే కృష్ణకి గర్భసంచి లేదు అంటాడు. కానీ తల్లికాబోతున్నట్టు మోసం చేశారు. మరి అమ్మకి కోపం రాదా అందుకే మా అమ్మ తనని కొట్టింది.

విలవిల్లాడిపోయిన రేవతి

ఇది నిజమేనా అని రేవతి కృష్ణని నిలదీస్తుంది. నువ్వు కూడా మోసం చేశావా కృష్ణ. నిన్ను కన్నబిడ్డలా చూసుకున్నాను కదా. నీకు కష్టం వస్తే నేను విలవిల్లాడిపోయే దాన్ని. నువ్వు నన్ను మోసం చేశావ్ అనే నిజం ఈ గుండె తట్టుకోలేకపోతుందని రేవతి కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఎందుకు ఇంత పని చేశావ్. అసలు మేం నీకు ఏం అన్యాయం చేశావని భవానీ నిలదీస్తుంది. నిజం చెప్తే ఎక్కడ బయటకు గెంటేస్తావని ఇలా నాటకం ఆడిందని రజిని అంటుంది. పిల్లల్ని కనకపోతే నిన్ను బయటకు గెంటేసేంత కసాయి దానిలా కనిపిస్తున్నానా? అని భవానీ నిలదీస్తుంది.

పెద్దత్తయ్య నాకు పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్తే జాలిపడి గుండెల్లో పెట్టుకుని చూసేదాన్ని కదా. కానీ ఈరోజు నువ్వు నా గుండెల్ని ముక్కలు చేశావ్ కదా అంటుంది. ఈ నిజం బయట పడకూడదని నేను అనుకున్నానో అదే బయట పడేలా చేశావ్ కదా ముకుంద.

కృష్ణని అసహ్యించుకున్న భవానీ

ఇంతజరిగిన తర్వాత నేను ఎందుకు మౌనంగా ఉండాలి. నీ కడుపులో బిడ్డ మా బిడ్డ సరోగసి చేశామని చెప్పేస్తామని కృష్ణ అనుకుంటుంది. భవానీకి నిజం చెప్పబోయి ముకుంద బెదిరించిన విషయం ఆగిపోతుంది. నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీ ప్రాణం నా చేతిలో ఉందని ముకుంద సంబరపడుతుంది.

నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది కడుపుతో ఉన్న కృష్ణ వాంతులు చేసుకోవడం లేదు. మీరా కడుపుతో ఉందని అన్నాను. ఇంత దారుణంగా ఎవరిని మోసం చేయకూడదు కృష్ణ అని రజిని మాటలు అంటుంది. అందరూ తనని అసహ్యించుకోవడంతో కృష్ణ కూలబడి ఏడుస్తుంది.

ఏం జరుగుతుంది కృష్ణ అని మధు అడుగుతాడు. ఎంత మంచిది అనుకున్నాను. ఈ ఇంట్లో అందరి కంటే దానికి ఎక్కువ విలువ ఇచ్చానని భవానీ బాధపడుతుంది. అది చేసింది తప్పే అక్క కానీ మీరు వారసులు కావాలని ఆశపడుతున్నారు కదా అందుకే ఇలా చేసిందని రేవతి అంటుంది.

కృష్ణ కంటే మీరా బెస్ట్

నాకు వారసులు కావాలని కోరిక బలంగా ఉంది. కానీ కొడుకు, కోడలు కంటే ఎక్కువ కాదు కదా. నాకు ఈ ప్రాబ్లం ఉందని ముందే చెప్తే ప్రపంచం మొత్తం తిరిగి అయినా దాన్ని సరి చేయించే దాన్ని కదా. లేదంటే పిల్లలు పుట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. అది కూడా కుదరకపోతే దత్తత తీసుకునే దాన్ని. ఆదర్శ్ ఏమైనా నా కడుపున పుట్టాడా అయినా నా కొడుకు కాలేదా?

నా ప్రేమ దీనికి ఎందుకు అర్థం కాలేదు. నువ్వు తప్పుగా అనుకున్న సరే నీ కోడలు కంటే కూడా మీరానే చాలా బెస్ట్ అనిపిస్తుందని భవానీ ఆవేదనగా మాట్లాడుతుంది. అప్పుడే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే నిర్ణయానికి రావొద్దని రేవతి నచ్చజెప్పడానికి చూస్తుంది.

మధుకి నిజం చెప్పిన కృష్ణ

కృష్ణ తీసుకున్న నిర్ణయం తప్పు కావొచ్చు కానీ దాని వెనుక తప్పుడు ఆలోచన ఉండదు. కృష్ణ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. కానీ మీరా అలా కాదు తను చెప్పేది నిజమైనా అబద్ధమైన దాని వెనుక చెడు ఉద్దేశం ఉంది. అది ఎప్పటికైనా ప్రమాదమేనని అంటుంది.

మురారి ఎక్కడికి వెళ్లాడో అర్థం కావడం లేదు. దీని గురించి ఇద్దరూ తోడికోడళ్ళు బాధపడతారు. కృష్ణ జరిగింది మొత్తం మధుకి చెప్తుంది. నేనేమీ మోసం చేయలేదు. వారసురాలిని ఇస్తానని మాట ఇచ్చాను ఇస్తున్నాను. కాకపోతే నా కడుపున మోయడం లేదు అంతేనని కృష్ణ చెప్తుంది.

సరోగసి అంటే పెద్దత్తయ్య ఒప్పుకోదని భయపడ్డాను. తన కోరిక తీర్చడానికి మాకు వేరే కారణం దొరకలేదని అంటుంది. నీకు పిల్లలు పుట్టడం లేదంటే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సరోగసి ద్వారా పిల్లల్ని కంటాను అంటే ఎలా వద్దని అంటుంది. నువ్వు పెద్దమ్మని తప్పుగా అర్థం చేసుకున్నావని మధు అంటాడు.

మురారినే తండ్రి

ఏమో మధు అప్పుడు భయపడ్డాం. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పాలని మధు బలవంతం చేస్తాడు. నిజం చెప్తే మీరా నా బిడ్డని చంపేస్తుందని కృష్ణ చెప్తుంది. అదే చేస్తే నేనే దాన్ని చంపేస్తానని మధు కోపంగా అంటాడు. మీరా అందరిలాంటిది కాదని వద్దని కృష్ణ బతిమలాడుతుంది.

అవసరం అయితే మీరా కాళ్ళు విరగ్గొట్టి అయినా బిడ్డని కనెలా చేస్తాము ఏంటి అది చేసేది ఇప్పుడే నిజం చెప్పేయాలని ఆవేశంగా వెళ్ళి అందరినీ పిలుస్తాడు. వద్దని కృష్ణ బతిమలాడుతుంది. అందరూ వస్తారు. మురారి ఏ తప్పు చేయలేదు. మీ సంతోషం కోసం కృష్ణ నరకం అనుభవిస్తుంది తప్ప ఎవరిని మోసం చేయలేదు.

ఇప్పుడు ఏమంటావ్ మీరా కడుపులో బిడ్డకు తండ్రి మురారి కాదని అంటావా అని రజిని అడుగుతుంది. కచ్చితంగా మీరా కడుపులో బిడ్డకు మురారి తండ్రి అందులో ఏ డౌట్ లేదు అత్తయ్య. అంటే మురారి తప్పు చేసినట్టే కదాని భవానీ అడుగుతుంది.

ప్లేటు మార్చేసిన ముకుంద

మీరా కడుపులో బిడ్డకు తండ్రి మురారి కానీ తను మీరా బిడ్డ కాదు. అది మురారి, కృష్ణల బిడ్డ. కృష్ణకి పిల్లలు పుట్టరని తెలిశాక సరోగసి ద్వారా మీరా గర్భాన్ని వాడుకున్నారు అంతే అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నువ్వు చెప్పింది నిజమేనా మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా వారసుడా అని భవానీ అడుగుతుంది.

కృష్ణ అవునని అంటుంది. నో ఇదంతా అబద్ధమని మీరా గట్టిగా అరుస్తుంది. ఇది నా బిడ్డ మురారి వల్ల నాకు కలిగిన బిడ్డ. ఎక్కడ మురారి నాకు కాకుండా పోతాడోనని కృష్ణ నాటకం ఆడుతుందని అంటుంది. ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తానని మధు వార్నింగ్ ఇస్తాడు.

ఇదే అబద్ధాలు చెప్తుంది దీని బతుకు ఒక అబద్దాల పుట్ట. ఇది రాగానే మురారి మీద కన్నేసింది. తనని దక్కించుకోవడానికి చూసింది. అప్పుడే కృష్ణ గర్భసంచి పోయి పిల్లలు పుట్టరని తెలుసుకుని నాటకం మొదలుపెట్టిందని మధు ఆవేశంగా చెప్తాడు.

అక్కడితో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024