Krishna mukunda murari serial:ముకుంద మరో కుట్ర.. ఎంత మోసం చేశావే అంటూ కృష్ణ చెంప పగలగొట్టిన భవానీ
Krishna mukunda murari serial today may 31st episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ముకుంద కుట్రకు కృష్ణ మరోసారి బలి అయ్యింది. తను తల్లి కాలేదనే రిపోర్ట్స్ భవానీ కంట పడేలా చేస్తుంది. దీంతో భవానీ కోపంతో రగిలిపోతూ కృష్ణ చెంప చెల్లుమనిపిస్తుంది.
Krishna mukunda murari serial today may 31st episode: గుడిలో జరిగిన అపశృతి గురించి భవానీ రేవతికి చెప్తుంది. దీంతో తన ఆందోళన మరింత రెట్టింపు అవుతుంది. మీరా ఎక్కడికి పోయిందా అని భవానీ టెన్షన్ పడుతుంది. ఇంట్లో చేరి ఇన్ని నాటకాలు ఆడింది బయటకు పోయింది ఏం చేయకుండా ఎలా ఉంటుందని భయపడుతుంది.
తప్పు చేశావ్ కృష్ణ
కృష్ణని తీసుకుని ముకుంద ఇంటికి బయల్దేరుతుంది. ఎందుకు నన్ను పట్టి పీడిస్తున్నావ్ నేను నీకు ఏం అన్యాయం చేశానని కృష్ణ బాధగా అడుగుతుంది. నువ్వు నాకు ఏ అన్యాయం చేయలేదు కానీ నాకు అడ్డుగా ఉన్నావ్. నా మురారిని పెళ్లి చేసుకున్నావ్ ఇంకా తనని అంటి పెట్టుకుని ఉండి పెద్ద తప్పు చేశావని అంటుంది.
నా మురారిని నువ్వు ఏమైన ప్రేమించావా? కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నావ్ అయిపోయాక వెళ్ళకుండా ఎందుకు ఉన్నావని ముకుంద అడుగుతుంది. ఆశపడినంత మాత్రాన ఏది దక్కదు రాసి పెట్టి ఉండాలని కృష్ణ అంటుంది. ముకుందలా మొహాన్ని ఇచ్చాడు దేవుడు… ఇప్పుడు మార్చుకోలేదా ఏంటి?
పుట్టింటికి వెళ్లిపో
ఈ రూపం మార్చుకోవడానికి యాక్సిడెంట్ చేయించుకున్నాను. ప్రాణాలకు తెగించి ఎంత కాలిక్యులేటెడ్ గా మొహం మార్చుకున్నాను. ఎంతో జాగ్రత్తగా మురారిని విడిపించి పెద్దత్తయ్యతోనే ఇంట్లోకి వచ్చేలా చేసుకున్నాను. నిన్ను మురారిని బురిడీ కొట్టించి మీ బిడ్డని నా కడుపున పుట్టెలా చేసుకున్నాను.
నువ్వు అయితే ఇంతకు తెగించే దానివా అంటుంది. దీన్ని తెగింపు అనరు బరితెగింపు అంటారు. నా రాత ఇదే అనుకుని వెళ్లిపోయేదాన్ని అంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇటు నుంచి ఇటే పుట్టింటికి వెళ్లిపో. మురారిని నేను చూసుకుంటాను.
వెళ్లిపోవాల్సింది నేను కాదు ముకుంద నువ్వు. మేం వెనక్కి తిరిగి రాలేనంత దూరం ప్రయాణం చేశాము. నువ్వు ఇంకా ప్రయాణం మొదలు పెట్టాలని ఆరాటపడుతున్నావ్. నా పోరాటం ముందు నీ ఆరాటం ఎప్పటికీ నెగ్గదని కృష్ణ ధీటుగా సమాధానం చెప్తుంది.
ఇంటికి వచ్చిన కృష్ణ
ఇంటికి వచ్చి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నావని ముకుంద అంటే నువ్వు నన్నేం చేయలేవని కృష్ణ చెప్తుంది. మీరా, మురారి కలిసి ఎక్కడికైనా వెళ్లిపోయారు ఏమోనని రజిని మళ్ళీ భవానీ దగ్గర అంటుంది. అప్పుడే పోలీసులు భవానీ ఇంటికి వస్తారు.
కృష్ణ, మీరా కూడా ఇంటికి వస్తారు. పోలీసులను ఇంట్లో చూసి ఏమైందని కృష్ణ కంగారుగా అడుగుతుంది. కృష్ణ రావడం చూసి ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. ఉన్నట్టుండి కనిపించకుండా పోతే మురారిని తీసుకుని ఎక్కడికైనా చెక్కేశావ్ అనుకుంటే కృష్ణని వెంట పెట్టుకుని తీసుకొచ్చావ్ ఏంటని రజిని అడుగుతుంది.
ఏం జరుగుతుంది పోలీసులు ఎందుకు వచ్చారని కృష్ణ భవానీని అడుగుతుంది. ఎందుకు వచ్చావ్ నాలుగు రోజులు అక్కడే ఉండమని చెప్పాను కదాని భవానీ అంటుంది. ఎందుకు అత్తయ్య ఇక్కడ జరిగేది తెలియకుండా ఉండటానికా అంటుంది. ఏమైందని పోలీసులను అడుగుతుంది.
మీరాని గర్భవతిని చేసి పారిపోయాడు
మురారి మూడు రోజులుగా కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదని పోలీసులు చెప్తారు. దీంతో కృష్ణ షాక్ అవుతుంది. ప్రాజెక్ట్ పని మీద బయటకు వెళ్లారని అన్నారు కదా కనిపించకపోవడం ఏంటని కృష్ణ ఇంట్లో అందరినీ అడుగుతుంది.
అందరూ మౌనంగా తలలు దించుకుంటారు. ఆదర్శ్ వచ్చి నేను చెప్తానని అంటాడు. మీ ఏసీపీ సర్ కి ఏం కాలేదు. వాడే ఈ మీరాని గర్భవతిని చేసి ఎక్కడికో పారిపోయాడు. అంటే కడుపులో ఉన్న మా బిడ్డని చూపించి ఏసీపీ సర్ వల్ల నేరుగా తల్లి అయినట్టు ఇంట్లో వాళ్ళని నమ్మించిందని కృష్ణ అర్థం చేసుకుంటుంది.
కృష్ణ మౌనంగా ఉండటంతో మురారి తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా? అని రజిని అడుగుతుంది. ముకుంద ఇంత చేస్తుంటే ఏసీపీ సర్ ఎందుకు మాట్లాడలేదు నా దగ్గరకు అయినా వచ్చి ఉండాలి కదా అనుకుంటుంది. ఇన్ స్పెక్టర్ భవానీని పక్కకి పిలిచి మాట్లాడతాడు. మురారి ఎవరినీ ఫేస్ చేయలేక ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండవచ్చు.
కుట్రలు బయటపెడతా
ఆయన ఉద్దేశం చెప్తూ ఎక్కడో నోట్ రాసి పెట్టి ఉంటాడు వెతకమని చెప్తాడు. ఆ మాటలు ముకుంద విని లోపలికి వెళ్ళిపోతుంది. రేవతి బాధగా కూర్చుని ఉంటే కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. మీకు మీ కొడుకు మీద నమ్మకం లేదేమో కానీ నాకు నా మొగుడి మీద నమ్మకం ఉందని అంటుంది.
మరీ ఇంత పిచ్చిదానిలా ఉన్నావ్ ఏంటి నువ్వు. నీ కాపురం ఏమవుతుందోనని భయంగా ఉందని రేవతి ఏడుస్తుంది. ఎప్పుడు లేనిది మీరా గర్భవతి అని తెలియగానే వాడు కనిపించకపోవడం ఏంటి? మురారి ఇలాంటి పని చేయడం ఏంటని అంటే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తుంది అందుకే మరింత భయంగా ఉందని అంటుంది.
అవన్నీ అబద్ధాలు నిజం ఏంటో నిదానంగా తెలుస్తుందని కృష్ణ భరోసా ఇస్తుంది. అన్ని కుట్రలు బయటపడతాయి నిజాలు తేలుస్తానని హామీ ఇస్తుంది. భవానీ మురారి వాళ్ళ గదికి వచ్చి అంతా వెతుకుతుంది. బెడ్ పక్కన హాస్పిటల్ రిపోర్ట్స్ చూసి భవానీ కుప్పకూలిపోతుంది.
తరువాయి భాగంలో..
భవానీ కోపంగా కృష్ణని పిలిచి ఎంత మోసం చేశావ్ అని చెంప పగలగొడుతుంది. తల్లి కాబోతుందని వారసుడిని ఇస్తుందని తెగ నెత్తిన పెట్టుకున్నారు కదా ఈవిడను. అదంతా నాటకం ఏం లేదు. ఇప్పుడే కాదు ఈ జన్మకి కృష్ణకు బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదని ఆదర్శ్ చెప్తాడు.
టాపిక్