Krishna mukunda murari serial: ఆదర్శ్ కి చీవాట్లు పెట్టిన భవానీ.. మురారి ఆచూకీ కృష్ణ కనిపెట్టగలుతుందా?
Krishna mukunda murari serial today may 30th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. మీరా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందుకు కారణం ఆదర్శ్ అనేసరికి భవానీ కోపంగా కొడుకుని తిడుతుంది. ఇక కృష్ణ ఇంటికి రావడంతో మురారి కనిపించడం లేదని తెలిసిపోతుంది.
Krishna mukunda murari serial today may 30th episode: అల్లుడి ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ వచ్చింది, అక్కడ ఏమైనా గలాటా అయి అరెస్ట్ జరిగిందేమోనని ప్రభాకర్ అంటాడు. అలాంటిది ఏమి లేడని పని మీద వెళ్లాడని చెప్తుంది. కృష్ణ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. మురారి వచ్చాడు అనుకుని పరుగున వస్తుంది.
కృష్ణ దగ్గరకు వచ్చిన ముకుంద
ముకుందను చూసి ఎందుకు వచ్చావని కోపంగా అడుగుతుంది. నీ కోసమే కృష్ణ అక్కడ నా వల్ల టెన్షన్ భరించలేక ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని వచ్చావు కదా. నిన్ను ఎలా ప్రశాంతంగా ఉండనిస్తానని ముకుంద అంటుంది. నువ్వు ఎప్పుడైతే ముకుంద అని తెలిసిందో అప్పుడే ప్రశాంతత పోయిందని చెప్తుంది.
ఎందుకు వచ్చావ్ అంటే నా మురారి ఇంకా నీ దగ్గరే ఉన్నాడు కదా తనని సొంతం చేసుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అసలు నువ్వు ఈ రెండు రోజులు నువ్వు మురారి ఇంట్లో ఉంటే నేను అనుకున్నది జరిగిపోయేది. ఇద్దరూ బాగానే తప్పించుకున్నారు.
ఇంతకీ మురారి ఎక్కడని అడుగుతుంది. ఆయన గురించి నీకెందుకు అంటుంది. ఏం చేసినా అది మురారి కోసమే కదా తెలిసి కూడా ఎందుకు అలా అడుగుతావు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా శకుంతల వచ్చి ఎవరు ఈమె అంటుంది. నా ఫ్రెండ్ మీరా అని పరిచయం చేస్తుంది.
నోరు జారిన శకుంతల
శకుంతల మాటల్లో మురారి గురించి నోరు జారుతుంది. ఏదో పనిలో ఉన్నాడని ఇక్కడికి రాలేదని చెప్పేస్తుంది. మురారి ఇక్కడికి కూడా రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు అని ముకుంద ఆలోచనలో పడుతుంది. మురారి ఎక్కడికి వెళ్ళాడు అని భవానీ ఆలోచిస్తుంది.
ఇంట్లో అందరూ డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. మీరా వెళ్లిపోయిందని రేవతి చెప్తుంది. అంటే మురారి తప్పు ఏం లేదని చెప్పేసి వెళ్లిపోయిందాని అడుగుతుంది. లేదు అని ఆదర్శ్ చేసిన గొడవ మొత్తం మధు చెప్తాడు.
మురారి అన్నయ్య తప్పు చేయలేదు, మీరా తప్పు చేయడం వల్ల పారిపోయిందని నందిని అంటుంది. ఒకవేళ మురారి తప్పు చేస్తే, న్యాయం గురించి అడిగితే చంపాలని చూస్తే మీరా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏంటి పరిస్థితి కాస్త కూడా ఆలోచించొద్దా అని భవానీ సీరియస్ అవుతుంది.
ఆదర్శ్ మీద భవానీ సీరియస్
భవానీ ఆవేశంగా ఆదర్శ్ దగ్గరకు వస్తుంది. కొడుకు మీద అరుస్తుంది. మీరాని ఎందుకు చంపాలని అనుకున్నావ్. సమయానికి రేవతి వచ్చింది కాబట్టి సరిపోయింది. అయినా ఎందుకు అంత ఆవేశం మీరా ఇక్కడే ఉంటే మురారి ఏ తప్పు చేయలేదని నిరూపించే వాళ్ళం. ఇప్పుడు మీరా ఎక్కడికి వెళ్లిందోనని అంటుంది.
తప్పు చేసిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు కానీ మోసపోయిన నీ కొడుకు కనిపించడం లేదా నీకు. అసలు ఇన్నేళ్లలో ఎప్పుడైనా నీ మాట జవాదాటానా? ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటాను అన్నాను. నాతో సరదాగా ఉండి మోసం చేసి వెళ్ళిపోయింది ఆ బాధ కనిపించడం లేదా?
బాధ ఉంటే చంపేస్తారా? నీ బాధ ఆలోచనగా మారి పరిష్కారం అవాలి. కానీ కొత్త సమస్య తీసుకురాకూడదు. మీరా ఎందుకు వచ్చిందో తెలియదు, మురారి తండ్రి అని ఎందుకు చెప్పిందో తెలియదు. మీరా ఇక్కడ ఉంటేనే కదా తెలిసేదని అంటుంది. నీ ఆవేశం వల్ల ఎన్ని అనార్థాలు వచ్చాయోనని కొడుకుని మందలిస్తుంది.
ముకుంద వగలమారి
ప్రభాకర్ మీరాతో కృష్ణ గురించి మాట్లాడతాడు. కృష్ణ అమాయకురాలు అని చెప్తారు. ఇంట్లో ఒక పిల్ల ముకుంద అనేది ఉంది తన మొగుడిని ఏడిపించేది. ఆ అమ్మాయిని చూశాక ఇలాంటి ఆడపిల్ల కూడా ఉంటుందా అనిపించింది. అది వగలమారి. కానీ ముకుంద నా బిడ్డ కాపురంలో నిప్పులు పోయాలని చూసేది.
నాకే అవకాశం దొరికితే జుట్టు పట్టుకుని కొట్టేదాన్ని అని శకుంతల అనేసరికి ముకుంద బిత్తరపోతుంది. మాకు ఆ ఛాన్స్ లేదులే దాని పాపానికి దేవుడు తీసుకుపోయాడని ప్రభాకర్ అంటాడు. ఎందుకు ఇప్పుడు మీ కళ్ల ముందే ఉందని ముకుంద అనేసరికి అందరూ షాక్ అవుతారు.
కృష్ణని టెన్షన్ పెట్టేందుకు కావాలని ముకుంద ఇరికించేలా మాట్లాడుతుంది. ఇక మేము బయల్దేరాటాము కృష్ణ కూడా నాతో పాటు వస్తుందని అంటుంది. దీంతో కృష్ణ కూడా వెళ్తానని చెప్తుంది. రేవతి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. కృష్ణకి జరిగింది ఎలా చెప్పాలో అర్థం కాలేదని భవానీ, రేవతి బాధపడతారు.
ఇదంతా నా వల్లే
ఇదంతా నా వల్లే జరిగిందని అనిపిస్తుంది. ఆరోజు మురారిని కాపాడినందుకు ఏదో సాయం చేయమని వదిలేయమని మీరందరూ అంటే తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తప్పు చేశాను. ఈ ఇంట్లోకి ఒక ఆడపిల్ల వచ్చాక తను ఏం చేస్తుందో అని ఆలోచించకుండా తప్పు చేశాను.
కృష్ణకి విషయం చెప్పకుండా ఇంకొక తప్పు చేశాను. అక్కడ పల్లకి సేవ చేయమని ప్రభాకర్ చెప్పాడు. కల్మషం లేని వాళ్ళు చేయాలి కానీ నేను మనసులో ఒకట పెట్టుకుని అలా చేశాను కదా పల్లకి నుంచి అమ్మవారి విగ్రహం దొర్లి పడబోయిందని చెప్తుంది.