Krishna mukunda murari serial: ముకుంద తలకు గన్ గురి పెట్టిన ఆదర్శ్.. మీరా చెప్పింది నిజమే అయిఉంటుందన్న భవానీ-krishna mukunda murari serial today may 28th episode adarsh lashes out mukund for deceiving him ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: ముకుంద తలకు గన్ గురి పెట్టిన ఆదర్శ్.. మీరా చెప్పింది నిజమే అయిఉంటుందన్న భవానీ

Krishna mukunda murari serial: ముకుంద తలకు గన్ గురి పెట్టిన ఆదర్శ్.. మీరా చెప్పింది నిజమే అయిఉంటుందన్న భవానీ

Gunti Soundarya HT Telugu
May 28, 2024 08:11 AM IST

Krishna mukunda murari serial today may 28th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తనని మోసం చేసిందని ఆదర్శ్ ఆవేశంగా గన్ తీసుకొచ్చి ముకుంద తలకు గురి పెడతాడు. మురారి కనిపించకపోవడానికి కూడా తనే కారణామని చంపేస్తానని ఆవేశపడతాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 28వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 28వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today may 28th episode: ఆదర్శ్ తినకుండా వెళ్లిపోవడంతో ఇంటికి పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ఏంటోనని రేవతి అంటుంది. మీరు నన్నే కదా అంటుంది. నేను మీ వారసుడిని మోస్తున్నానని ముకుంద అంటుంది. నీబిడ్డకు తండ్రి మురారి అంటే ఎవరూ నమ్మరు అని రజిని అంటుంది.

మురారి ఎక్కడికి వెళ్ళాడు?

అందుకే కదా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తుంది. మీ అన్నయ్య ఉండి ఉంటే నా బిడ్డకు తండ్రి తనేనని ఒప్పుకునే వాడు. బిడ్డని మోస్తున్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటానని చెప్పి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని బాధగా మాట్లాడుతుంది.

గుడికి వెళ్లాలని రెడీ అవమని శకుంతల అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చీర అని చెప్తుంది. గుడిలో జాతరకు రెడీ అవమని భవానీకి కూడా చెప్తారు. అల్లుడు కూడా వచ్చి ఉంటే బాగుండేదని ప్రభాకర్ అంటాడు. ఆయన ఏదో పని మీద వెళ్లారు కదా నేను పెద్దత్తయ్యతో ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇద్దరం కలిసి వస్తామని కృష్ణ చెప్తుంది.

కృష్ణ ఇంటికి వస్తే మురారి లేడనే విషయం తెలుస్తుంది. బాబోయ్ నిజం తెలిస్తే ప్రాణాలు వదిలేస్తుందని భవానీ భయపడుతుంది. ఇంటి దగ్గర జరిగిన విషయాలు తింగరిదానికి తెలియకూడదని భవానీ దేవుడిని వేడుకుంటుంది. ఆదర్శ్ మళ్ళీ తాగడం మొదలుపెడతాడు.

గన్ గురిపెట్టిన ఆదర్శ్ 

ముకుంద మాటలు గుర్తు చేసుకుని ఆవేశంగా గన్ తీసుకుని కిందకు వస్తాడు. ముకుంద తలకు గన్ గురి పెడతాడు. రేవతితో పాటు అందరూ తనని అడ్డుకుంటారు. దీని లాంటి మోసగత్తెకి ఇదే నేను విధించే శిక్ష అని ఆవేశపడతాడు. గన్ లోడ్ అయి ఉండటంతో గాల్లోకి పేలుతుంది.

రేవతి ఆదర్శ్ చెంప పగలగొడుతుంది. ఇంత మూర్ఖంగా ఎందుకు చేస్తున్నావ్ తను ఒట్టి మనిషి కాదని మర్చిపోయావా అని నందిని నిలదీస్తుంది. తను ఒట్టి మనిషి కావడం కాదు నన్ను మనిషిగా కాకుండ చేసింది. నన్ను ఇంతగా మోసం చేసిన ఆడదాన్ని నేను ఎక్కడ చూడలేదని ఆదర్శ్ అంటాడు.

మురారి కనిపించకుండా పోవడానికి కారణం ఇదే 

మీరా చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించే వరకు మౌనంగా ఉండాలని ఆవేశపడొద్దని రేవతి సర్ది చెప్తుంది. నువ్వు చేసిన మోసానికి చంపేయాలి కానీ చూడు నీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో. ఇంట్లో జరిగిన వాటికి ఇదే కారణం. ఒకవేళ మురారి వల్లే తల్లి అయితే వాళ్ళు వాళ్ళు ఏడవొచ్చు కదా నా జీవితంతో ఎందుకు ఆడుకుంది.

నాతో పెళ్లి అంటే ఒప్పుకుంది. ఇలాగే మురారిని కూడా మాయ చేసి ఉంటుంది. అసలు మురారి కనిపించకుండా పోవడానికి కారణం ఇదేనేమో. ఏమో కాదు ఇదే నిజం మురారి కనిపించకపోవడానికి కారణం ఇదే. అందుకే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని గట్టిగా చెప్తుంది.

చెప్పవే మురారిని ఏం చేశావ్అని తనని చంపేస్తానని మీదకు వెళ్లబోతుంటే మధు అడ్డుపడి గదిలోకి తీసుకెళ్తాడు. వాడు తాగిన మత్తులో మాట్లాడుతున్నాడు. పొరపాటున వాడు చెప్పింది నిజమయితే ఆదర్శ్ మాత్రమే కాదు ఈ ఇంట్లో ఎవరూ నిన్ను బతకనివ్వరని రేవతి ముకుందకు వార్నింగ్ ఇస్తుంది.

మీరా చెప్పింది నిజమేనేమో 

కృష్ణ, భవానీ గుడికి వెళతారు. కృష్ణతో ముడుపు కట్టించమని ప్రభాకర్ చెప్తాడు. ఊర్లో అందరూ కృష్ణ తల్లి కాబోతుందట కదా అని శకుంతలని అడుగుతారు. కృష్ణ ముడుపు కడుతూ ముకుంద మాటలు తలుచుకుని కళ్ళు తిరిగిపడిపోతుంది.

పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి కదాని ప్రభాకర్ శకుంతల మీద అరుస్తాడు. రేవతి ఫోన్ చేసి భవానీతో మాట్లాడుతుంది. మురారి అక్కడ ఉన్నాడా అంటే లేడని అంటుంది. వాడు కనిపించకపోవడం చూస్తుంటే మీరా చెప్పింది నిజమని అనిపిస్తుందని చెప్తుంది.

పాపం కృష్ణ 

నాకు వంద జన్మలకు సరిపడా కష్టాలు ఇచ్చావు. అంత పాపం నేను ఏం చేశాను. అమ్మని కావాలని కోరిక కోరాను. అది నెరవేరనివ్వలేదు. నా బిడ్డను నన్ను శత్రువులా చూసే ముకుంద గర్భంలో పెరిగేలా చేశావ్. నిజం చెప్పలేక కన్నబిడ్డల్లా చూసే ఇద్దరు అమ్మలను మోసం చేస్తున్నాను.

మా చిన్నాన్న చిన్నమ్మను మోసం చేస్తున్నా. లేని గర్భాన్ని ఉన్నట్టు నటించడం ఎంత నరకమో. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదని బాధపడుతుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

గుడిలో జాతర సందర్భంగా పల్లకి మోస్తారు భవానీ, కృష్ణ. నా సమస్యలు నువ్వే దించేయాలని కృష్ణ అమ్మవారిని వేడుకుంటుంది. కృష్ణ పల్లకి సరిగా పట్టుకోకపోయే సరికి అమ్మవారి విగ్రహం పడబోతుంది.

టీ20 వరల్డ్ కప్ 2024