Krishna mukunda murari serial: మురారి మిస్సింగ్.. డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమన్న మీరా, కృష్ణ దగ్గర నిజం దాచిన భవానీ
Krishna mukunda murari serial today may 27th episode: మీరా తన కడుపులో బిడ్డకు తండ్రి మురారి. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని సవాలు చేస్తుంది. మురారి మిస్సింగ్ అనే విషయం కృష్ణ దగ్గర భవానీ దాస్తుంది.
Krishna mukunda murari serial today may 27th episode: ఆదర్శ్ ఆవేశంగా మురారి గురించి తప్పుగా మాట్లాడతాడు. ఎదుటివాళ్ళ జీవితాలతో ఎప్పుడు ఆదుకోవాలని మురారి అనుకోలేదని రేవతి అంటుంది. నువ్వు ముకుందని ఇష్టపడుతున్నావని తెలిసి తన ప్రేమని త్యాగం చేశాడని చెప్తుంది.
మురారి తప్పు చేయడు
భవానీ కూడా ఆదర్శ్ కి అడ్డు చెప్తుంది. వాడు అంటే నాకు ఇష్టమే కానీ పరిస్థితులను బట్టి ఇంతకంటే గొప్పగా మాట్లాడలేకపోతున్నాను. ప్రతిసారి నా గుండెల్లో మంటలు రేపేది వాడేనని అంటాడు. తొందరపడి అపార్థం చేసుకోవద్దని నందిని అంటుంది. భవానీ మురారికి ఫోన్ చేయమంటుంది.
మురారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మురారి ఉంటే సరోగసి మ్యాటర్ బయటపడేది ఇక కృష్ణ ఎప్పటికీ ఇంటికి రాలేదని ముకుంద హ్యాపీగా ఫీల్అవుతుంది. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని మధు చెప్తాడు. నేను చెప్పాను కదా ఇప్పుడు వాడు కనిపించడు ఫోన్ కూడా పని చేయదని ఆదర్శ్ అంటాడు.
నిన్ను పెంచినట్టే వాడిని పెంచాను మురారి ఏ తప్పు చేయడు, వాడికి ఆ అవసరం లేదని భవానీ అంటుంది. అంటే ఏంటి మీరా తప్పు చేసిందా అని రజిని నోరు జారుతుంది. మురారి తప్పు చేయలేదని అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా అంటుంది. నువ్వు తల్లి కావడానికి కారణం ఎవరని రజిని మరోసారి అడుగుతుంది.
ఆదర్శ్ తో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావ్
ఒక్కోసారి ఒక్కో పేరు చెప్పే అలవాటు తనకు లేదని ముకుంద సమర్థించుకుంటుంది. మరి ఇన్నాళ్ళూ ఎందుకు అబద్ధాలు చెప్పావు నువ్వు తల్లివి కావడానికి మురారి కారణం అయితే అది చెప్పకుండా ఆదర్శ్ తో పెళ్ళికి ఎందుకు రెడీ అయ్యావని మధు నిలదీస్తాడు.
నువ్వు చెప్పేది నిజం అయితే ఆదర్శ్ తో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావని భవానీ కూడా నిలదీస్తుంది. అది మురారి వచ్చాక అడగమని ముకుంద చెప్తుంది. ఇంటికి రాగానే ఇద్దరికీ లైన్ వేసింది. ఎవరు పడితే వాళ్ళతో ఇంటికి కోడలు అవుదామని అనుకుంది కానీ ఇంతలోనే మురారితో ఇలా జరిగిపోయిందని రజినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.
మీరా పెద్ద ప్లాన్ తోనే ఇంటికి వచ్చింది
మురారి బావకు బంగారం లాంటి కృష్ణ అక్క ఉంది. ఈ మీరా అబద్ధాలు చెప్తుందని సంగీత అంటుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే మురారి వచ్చాక అడగమని మీరా కోపంగా అంటుంది. అవసరం లేదు నాకు ఆదర్శ్ బావకు పెళ్లి చేస్తానని మా అమ్మకు మాట ఇచ్చావు.
ఆదర్శ్ బావ అంటే ఇష్టం లేదని చెప్పి పెళ్లికి రెడీ అయిపోయావు. అత్తయ్య ఇదేదో పెద్ద ప్లాన్ తోనే మన ఇంటికి వచ్చింది. దీన్ని బయటకు పంపించండని సంగీత అంటుంది. నాలాంటి అనాథలను వాడుకుని తర్వాత రోడ్డు మీదకు పంపించడం మీ అందరికీ అలవాటే కదాని మీరా అనేసరికి భవానీ సీరియస్ గా చూస్తుంది.
నేను చేసింది ఈ ఇంటి కోసమే కానీ మోసం చేయడానికి కాదు. ఆరోజే నేను మీతో రానని చెప్పాను మీరే బలవంతంగా తీసుకొచ్చారు. కనీసం మురారి వచ్చే వరకు కూడా ఆగడం లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అనాథను కావచ్చు కానీ ఆత్మాభిమానం లేకుండా బతకడం లేదు.
డీఎన్ఏ టెస్ట్ చేయించండి
మీరు చెప్పిన దానికి అనుమానం ఉంటే మురారి వచ్చేవరకు ఓపిక పట్టండి. ఒకవేళ మురారికి ఏ సంబంధం లేదని చెప్తే.. తను అబద్ధం చెప్పినా చెప్తాడు. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించండి. అప్పుడు తేలుతుంది నా బిడ్డకు మురారి తండ్రి అని తేలుతుందని ధీమాగా చెప్తుంది.
ఒకవేళ కాదని తేలితే అని నందిని అంటే ఈ ఇంటి గుమ్మానికి ఉరి వేయండి నేను ఎక్కడికి పారిపోనని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. అందరూ దిగులుగా కూర్చుని ఉంటారు. తన కొడుకు అలాంటి వాడు కాదని రేవతి ఏడుస్తుంది. మురారి ఎత్తిపరిస్థితుల్లోనూ తప్పు చేయడని మధు అంటాడు.
మురారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే తప్పు లేదని తెలుస్తుందని భవానీ అంటుంది. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది కానీ మురారి లేకపోవడం వల్ల మీరా ఎన్ని మాటలు అన్నా సమాధానం చెప్పలేకపోతున్నాం. పైగా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తుంది.
ఏదో కుట్ర జరుగుతుంది
మురారి తప్పు చేశాడా అందుకే అంత ఖచ్చితంగా చెప్తుందా అని రేవతి అనుమానిస్తుంది. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. తప్పు చేస్తే తప్పించుకుని తిరిగే పిరికివాడు కాదు నా కొడుకు, మనకు తెలియకుండా ఏదో జరుగుతుందని రేవతి బాధపడుతుంది.
మన అదృష్టం బాగుండి కృష్ణ ఇంట్లో లేదు. తను ఉంటే అసలు ఇదంతా చూసి తట్టుకోలేదని భవానీ అనుకుంటుంది. కృష్ణ దగ్గరకు ఏమైనా వెళ్ళి ఉంటాడని అంటుంది. తనకి ఫోన్ చేసి విషయం తెలుసుకుందామని మధు అంటే వద్దు తానే వెళ్ళి మాట్లాడతానని సమస్యకు పరిష్కారం తెలుసుకుంటానని భవానీ అంటుంది.
కృష్ణ మురారికి ఫోన్ ట్రై చేస్తుంది కానీ స్విచ్చాఫ్ అని వస్తుండటంతో కంగారుపడుతుంది. అప్పుడే భవానీ కృష్ణ దగ్గరకు వస్తుంది. తనని చూసి కృష్ణ సంతోషంగా వెళ్ళి పలకరిస్తుంది. ప్రభాకర్ భవానీని పలకరిస్తాడు. అల్లుడిని కూడా తీసుకురావచ్చు కదా అంటాడు.
నిజం దాచిన భవానీ
ఏసీపీ సర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని కృష్ణ కూడా అడుగుతుంది. ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్లాడని భవానీ అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. పనిలో పడి అంతా మర్చిపోయాడని అంటుంది. మురారి ఇంట్లో లేడని తెలిస్తే ఏమౌవుతుంది, తనని వెతుక్కుంటూ వచ్చానని తెలిస్తే కంగారుపడుతుందని భవానీ నిజం దాస్తుంది.
ఊర్లో జాతర ఉందని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని ప్రభాకర్ భవానీని ఆపేస్తాడు. బిడ్డని అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్ళని ఆడుకోవాలని ముకుంద అనుకుంటుంది. అందరూ భోజనం చేస్తుండగా ముకుంద వస్తుంది. అమ్మ ఎక్కడని ఆదర్శ్ అంటే కృష్ణ దగ్గరకు వెళ్ళిందని రజిని చెప్తుంది.
ట్యాబ్లెట్స్ తెమ్మన్న ముకుంద
తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడని ఆదర్శ్ అంటే నిజం తెలిసే వరకు తప్పుగా మాట్లాడొద్దని మధు, నందిని సర్ది చెప్తారు. ముకుంద వచ్చి పొద్దున్నే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అయిపోయాయని తీసుకురమ్మని మధుని అడుగుతుంది. కోపంగా సమాధానం ఇస్తాడు.
ఇంట్లో ఎవరూ ట్యాబ్లెట్స్ తీసుకురామని చెప్తారు. ఆదర్శ్ కోపంగా ప్లేట్ లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోతాడు. ఇంటికి పట్టిన శని వదలాలని రేవతి ముకుందని తిడుతుంది. నన్ను ఎన్ని అయినా అనండి పడతాను కానీ నా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. తనకోసమైన ఆలోచించమని చెప్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
కృష్ణ, భవానీ గుడికి వెళతారు. కృష్ణ చెట్టుకు ముడుపు కడుతుంది. భవానీకి రేవతి ఫోన్ చేస్తుంది. ఆదర్శ్ కోపంగా ముకుంద తలకు గన్ గురిపెడతాడు. గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది.
టాపిక్