Krishna mukunda murari serial: ‘నా కడుపులో బిడ్డకు తండ్రి మురారి’.. కుప్పకూలిన ఆదర్శ్, షాక్ లో భవానీ ఫ్యామిలీ
Krishna mukunda murari serial today may 25th episode: నాటకం ప్రకారం తను ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో అందరికీ తెలిసేలా ముకుంద చేస్తుంది. ఆదర్శ్ కారణమని భవానీ కొడుకుని నిలదీస్తుంది. కానీ తన కడుపులో బిడ్డకు తండ్రి మురారి అని ముకుంద చెప్పేస్తుంది.
Krishna mukunda murari serial today may 25th episode: ముకుంద గర్భవతి అనే విషయం డాక్టర్ భవానీ ఇంట్లో అందరికీ చెప్తుంది. పెళ్లి కానీ ఒక ఆడపిల్లని ఇంట్లో పెట్టడం తప్పు. షాపింగ్ షికార్లు తిరిగారు. ఇప్పుడు బాధపడితే ఏం వస్తుందని రజిని అంటుంది. ఇక నాలుగు రోజుల్లో పెళ్లి అవుతుంది కదాని నందిని అంటుంది.
ఆదర్శ్ చెంప పగలగొట్టిన భవానీ
ఆదర్శ్ ఎక్కడ నిజం బయటకు రాగానే చల్లగా జారుకున్నాడని రజిని అంటుంది. ఆదర్శ్ ని అడిగితే అతను నిజం చెప్తాడు అప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను ఈ టైమ్ లో కృష్ణ ఉంటే బాగుండేదని ముకుంద తనలో తానే నవ్వుకుంటుంది.
భవానీ ఆదర్శ్ చెంప పగలగొడుతుంది. ముకుంద అంటే నీకు ఇష్టమని చెప్పావు కదా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నా కదా మరి ఎందుకు ఈ తొందర అనేసి కొడుకుని నిలదీస్తుంది. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదని ఆదర్శ్ అంటాడు.
అప్పుడు పెళ్లి చేసుకుని తొందరపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయావు ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తొందరపడి తప్పు చేశావని భవానీ తిడుతుంది. తాను ఏ తప్పు చేయలేదని చెప్తాడు. తప్పే ఎంత పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా పెళ్ళికి ముందు తల్లి కావడం తప్పని భవానీ సీరియస్ అవుతుంది.
ఆ బిడ్డకు తండ్రి నేను కాదు
మూడు ముళ్ళు వేశాక తల్లి అయితే ఇంట్లో పండగ, అదే పెళ్లి కాకుండా అయితే పరువు పోతుంది. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థం అయ్యింది. మీరా తల్లి కావడానికి కారణం నేనే అనుకుంటున్నావ్ కదా. కాదు కానే కాదు అనేసరికి భవానీ షాక్ అవుతుంది.
ఆ బిడ్డకు తండ్రిని తాను కాదని చెప్తాడు. మరి ఆ బిడ్డకి ఎవరో తండ్రి తనకి తెలియదని చెప్తాడు. ముకుంద చనిపోయాక ఇక ఎవరి కోసం బతకాలి ఆనుకున్నా అప్పుడే మీరా వచ్చింది. తన మాట ప్రవర్తన ఎందుకో ముకుందలా అనిపించింది. అందుకే తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.
ఆ విషయం నీకు చెప్పాను. నీకు ఇష్టమని తెలిశాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నేను ఎప్పుడు హద్దు దాటలేదు. తన మనసులో వేరొకరు ఉన్నారని తెలిసినా, తను తల్లి కాబోతుందని తెలిసినా తన వైపు చూసేదాన్ని కాదు. అసలు తను ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు.
నీ మీద ఒట్టు అమ్మా
నేనంటే ఇష్టం ఉన్నట్టే ఉంది పెళ్లి అంటే సరే అంది కానీ ఇంతలోనే ఇలా అవుతుంది. నా తలరాత ఇంతేనేమో నేను కోరుకున్నది నాకు దక్కదు ఏమో. నేను నీ కొడుకుని నేను ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయను ఇది నీమీద ఒట్టు వేసి చెప్తున్నాను అంటాడు.
ముకుంద స్పృహలోకి వస్తుంది. ముహూర్తాలతో సంబంధం లేకుండా వీళ్ళ పెళ్లి చేద్దామని రేవతి అంటుంది. ఎవరితో చేస్తావ్ రేవతి. ఎవరి బిడ్డకి ఎవరిని తండ్రిని చేద్దామని అనుకుంటున్నావని భవానీ కోపంగా అడుగుతుంది. కడుపుకు ఆదర్శ్ కారణం కదా తనతోనే పెళ్లి చేద్దామని రజిని అంటుంది.
నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని భవానీ చెప్తుంది. తన కడుపులో బిడ్డకి ఆదర్శ్ కి ఏ సంబంధం లేదని భవానీ కుండబద్ధలు కొట్టేస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు తల్లివి కావడానికి కారణం ఆదర్శ్ కాదని చెప్పాడు. ఒట్టేసి మరీ చెప్పాడని భవానీ అంటుంది.
ఆదర్శ్ కారణం కాదు
ఏంటి ఇదంతా అని ఆదర్శ్ ని మధు నిలదీస్తాడు. ఇద్దరూ కలిసి బాగా తిరిగారు కదా అంటే కలిసి తిరిగితే నేనేకారణమా? నేనే కారణం అయితే తప్పించుకుని తిరగనని ఆదర్శ్ చెప్తాడు. ఎందుకు ఆదర్శ్ తప్పు చేసినట్టు అందరూ నిలదీస్తున్నారు. నా కడుపులో బిడ్డకి ఆదర్శ్ కి సంబంధం ఉందని నేను చెప్పలేదు కదా.
మరి కారణం ఎవరని రేవతి నిలదీస్తుంది. తను మీరా కాదు ముకుంద ఎప్పటికీ కాలేదని ఆదర్శ్ కోపంగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. నిన్ను నమ్మినందుకు ఎలా బాధపడుతున్నాడోనని భవానీ అంటుంది. ఎవరితోనో సంబంధం పెట్టుకుని తల్లివి అయి మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావని అందరూ నానా మాటలు అంటారు.
బిడ్డకు తండ్రి మురారి
ఏ బికారినో ప్రేమించి ఉంటుందని రజిని అంటుంది. బికారి అనొద్దు తనని తక్కువ చేసి మాట్లాడొద్దని ముకుంద అరుస్తుంది. ఎందుకు మమ్మల్ని మోసం చేయాలని చూశావని రేవతి నిలదీస్తుంది. నా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసత్వం ఈ ఇంటి రక్తం అంటుంది.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఆదర్శ్ కూలబడిపోతాడు. కృష్ణ ఇంటి దగ్గర దిగాలుగా కూర్చుని ఉంటుంది. తనే ముకుంద అని తెలియక నా ప్రాణాన్ని దాని కడుపులో పెట్టాను. ఏసీపీ సర్ నా చెయ్యి జారిపోకుండా ఎలా కాపాడుకోవాలని అనుకుంటుంది.
మురారి పారిపోయాడు
తమ బిడ్డ తల్లి కాబోతుందని ప్రభాకర్, శకుంతల హడావుడి చేస్తారు. కానీ కృష్ణ మాత్రం బాధగా ఉంటుంది. వాళ్ళు కురిపించే ప్రేమ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకు అలా ఉన్నావని అడుగుతారు. ఏమి లేదని వాళ్ళకి చెప్తుంది. మురారి కోసం ఇల్లు అంతా వెతుకుతారు. కానీ ఇంట్లో ఎక్కడా లేడని మధు చెప్తాడు.
డాక్టర్ నిజం చెప్పగానే నిజం బయట పడుతుందని మురారి పారిపోయాడని ఆదర్శ్ ఆవేశంగా మాట్లాడతాడు. తన కొడుకు అలాంటి వాడు కాదని రేవతి అంటుంది. అప్పుడు తను ప్రేమించిన ముకుందని ఇచ్చి నాకు పెళ్లి చేసి జీవితం లేకుండా చేశాడు.
ఇప్పుడు తను తల్లిని చేసిన అమ్మాయిని నాకు భార్యని చేయాలని అనుకుంటున్నాడని ఆదర్శ్ ఆవేశపడతాడు. తన కొడుకు అలా చేసే వాడు కాదని రేవతి వెనకేసుకొస్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్