Krishna mukunda murari serial: మీరా, మురారి కలిసి వెళ్లిపోయారన్న రజిని.. పల్లకి సేవలో అపశృతి, టెన్షన్ లో కృష్ణ
Krishna mukunda murari serial today may 29th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. మీరా ఇంట్లో కనిపించదు. దీంతో మురారి, మీరా కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారని రేవతి ఒక్క క్షణం అనుమానిస్తుంది. రజిని అదే మాట అంటుంది.
Krishna mukunda murari serial today may 29th episode: కృష్ణ గుడిలో తన బాధను దేవుడికి మొరపెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ప్రభాకర్ కృష్ణ కోసం గుడి మొత్తం వెతుకుతాడు. ఏసీపీ సర్ ఫోన్ ఎందుకు ఆఫ్ అయ్యింది. ఆయనకు ఏమైంది. పెద్దత్తయ్య నాతో ఆ విషయం చెప్పలేకపోతుందా? అని కంగారుపడుతుంది.
మీరా మిస్సింగ్
ముకుంద నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుంది. చిక్కుల నుంచి ఎప్పుడు బయట పడతామని బాధపడుతుంది. ప్రభాకర్ కృష్ణ దగ్గరకు వస్తాడు. గుడిలో పల్లకి సేవ ఉందని, దాన్ని భవానీ, కృష్ణ మోయాలని చెప్తాడు. మీరిద్దరిదీ కల్లాకపటం లేని మనసు అందుకే ఈ పని చేస్తే అంతా మంచే జరుగుతుంది. కిట్టయ్యకు పండంటి బిడ్డ పుడుతుందని శకుంతల అంటుంది.
రేవతి మీరా కోసం పాలు తీసుకుని గదికి వస్తుంది. కానీ తను గదిలో కనిపించదు. రజిని ఎదురుపడితే మీరాని చూశావా అని అడుగుతుంది. తన కడుపులో ఉన్న బిడ్డకు నీ కొడుకే తండ్రి అని నమ్ముతున్నావా అని నోటికి పని చెప్తుంది. ఇంట్లో అందరినీ అడుగుతుంది. ఎవరూ మీరాని చూడలేదని చెప్తారు.
పల్లకి సేవలో అపశృతి
మీరా ఎక్కడ ఉందో వెతకమని రేవతి చెప్తుంది. గుడిలో పల్లకి సేవ మొదలవుతుంది. పల్లకిని ఎత్తుకుని మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని పూజారి చెప్తాడు. నిజాలు దాస్తున్నామని భవానీ, అబద్ధపు గర్భం నాటకం ఆడుతున్నానని కృష్ణ బాధపడతారు.
మురారి ఏ తప్పు చేయలేదని మనసు చెప్తుంది. కానీ ఏ తప్పు చేయకపోతే ఎక్కడికి వెళ్ళాడు. నిజం కనీసం నా కోడలికి కూడా చెప్పలేకపోతున్నానని భవానీ బాధపడుతుంది. పల్లకిలో ఉన్న అమ్మవారి విగ్రహం పక్కకి తూలుతుంది. పల్లకి మోసే వాళ్ళు ఏ కల్మషం లేకుండా ఉండాలి.
కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో మనసులో ఏదో పెట్టుకుని పైకి నటిస్తున్నారు. అందుకే అమ్మవారు ఈరోజు పల్లకి సేవ పూర్తికానివ్వలేదు. లోపల ఒకటి పైకి ఒకటి పెట్టుకుంది నేనే కదా. గర్భవతి కాకపోయినా గర్భవతిని అని చెప్తున్నా నా వల్లే ఇలా జరిగిందని కృష్ణ బాధపడుతుంది.
మీరా మురారి వెళ్లిపోయారేమో
మురారి గురించి చెప్పలేదని అందుకే ఇలా జరిగిందని భవానీ అనుకుంటుంది. మీరా ఎక్కడ కనిపించలేదని మధు, సంగీత చెప్పడంతో రేవతి చాలా కంగారుపడుతుంది. నుదుటి మీద గన్ పెట్టేసరికి ప్రాణభయంతో పారిపోయిందని రజిని అంటుంది.
మీరా అలా పారిపోయే రకం కాదని మధు అంటాడు. కృష్ణ ఇక్కడ లేదు మురారి కనిపించడం లేదు మీరా కూడా లేదు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమోనని రేవతి అనుమానిస్తుంది. ఏమో అదే నిజం కావచ్చు ఇది వాళ్ళిద్దరూ ఆడుతున్న నాటకం ఏమోనని రజినీ అంటుంది.
మురారి అలాంటి వాడు కాదు ఒకప్పుడు ముకుంద తను ప్రేమించినా కృష్ణ కోసం తనవైపు కూడా చూడలేదు. అలాంటిది మీరా వైపు చూడకుండా ఉంటాడా అని రజిని మాటలు అంటుంది. కృష్ణ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలని రేవతి టెన్షన్ పడుతుంది.
మురారికి ఏమైనా అయ్యిందా?
కిట్టయ్యకు మంచి జరుగుతుందని పల్లకి మోయిస్తే ఈ అపశకునం ఏంటని శకుంతల భయపడుతుంది. మురారికి ఏమైందోనని కృష్ణ, భవానీ టెన్షన్ పడతారు. భవానీ ఇంటికి వెళ్తానని అంటే కృష్ణ కూడా ఇంటికి వస్తానని చెప్తుంది. అక్కడికి వస్తే మొత్తం తెలిసిపోతుంది ఎలాగైనా ఆపాలని భవానీ వద్దని వారిస్తుంది.
ఏసీపీ సర్ నిజంగా బిజీగా ఉండి ఫోన్ చేయడం లేదా ఏదో జరిగిందని కృష్ణ అనుమానపడుతుంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కిట్టయ్య హుషారుగా లేదు అక్కడ ఏదో జరిగిందని ప్రభాకర్ వాళ్ళు కూడా అనుమానిస్తారు. విషయం తెలుసుకోవడం కోసం ప్రభాకర్ మురారికి ఫోన్ చేస్తే ఆఫ్ అని వస్తుంది.
ఆఫ్ అని వస్తుంది ఏమైంద అక్కడ అక్కడ ఏమైనా గలాటా జరిగి అరెస్ట్ ఏమైనా అయ్యాడా ఏంటని ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేస్తాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
భవానీ ఇంటికి పోలీసులు వస్తారు. కృష్ణ ముకుందని తీసుకుని ఇంటికి వస్తుంది. ఏం జరుగుతుందని కృష్ణ అడుగుతుంది. మురారి మూడు రోజుల నుంచి కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పడంతో కృష్ణ షాక్ అవుతుంది.
టాపిక్