Andhra Pradesh News Live September 24, 2024: R Krishnaiah Resigned : వైసీపీకి మరో బిగ్ షాక్, రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 24 Sep 202402:13 PM IST
- R Krishnaiah Resigned : వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8కి తగ్గింది.
Tue, 24 Sep 202412:50 PM IST
- Tirumala Laddu Row SIT : తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ చీఫ్ గా నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజు ఉన్నారు.
Tue, 24 Sep 202412:17 PM IST
- AP Paddy Procurement : 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికేంద్రీకరణ విధానంలో కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించింది.
Tue, 24 Sep 202411:46 AM IST
- Anganwadi Posts : అనంతపురం జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళలు అక్టోబర్ 1 వ తేదీ లోపు దరఖాస్తులు దాఖలు చేయాలి. మొత్తం 84 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులను పదో తరగతి అర్హత.
Tue, 24 Sep 202410:59 AM IST
- Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ ఓ వీడియో పోస్టు చేశారు. తన ట్వీట్ ను అపార్థం చేసుకున్నారన్నారు. కార్తి వ్యాఖ్యలపై సూర్య స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.
Tue, 24 Sep 202410:09 AM IST
- Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం వచ్చిందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. లడ్డూ పోటులో వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూలను తయారు చేస్తారని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులను కోరింది.
Tue, 24 Sep 202409:37 AM IST
- AP Job Mela : విశాఖ, నందికొట్కూరు, తిరుపతిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 1780 పోస్టుల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
Tue, 24 Sep 202408:56 AM IST
- Pawan Movie Shooting: ఎన్నికల ప్రచారం, అధికార బాధ్యతలతో షూటింగ్ నిలిచిపోయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ వైపు అధికారిక బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్లకు డేట్లు కేటాయించి షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Tue, 24 Sep 202408:40 AM IST
- Anantapur Chariot Burned : అనంతపురంలో జిల్లా హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి ఆగంతకులు నిప్పుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు గమనించే సరికి సగానికి పైగా రథం కాలిపోయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.
Tue, 24 Sep 202408:01 AM IST
- IRCTC Dwarka Darshan Package : బెంగళూరరు నుంచి ఐఆర్సీటీసీ ద్వారకా దర్శన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగ, సోమనాథ్, త్రయంబకేశ్వర్ మూడు ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు ద్వారకా కవర్ చేస్తూ 8 రోజులపాటు తీర్థయాత్ర సాగనుంది. తదుపరి పర్యటన తేదీ సెప్టెంబర్ 28.
Tue, 24 Sep 202407:54 AM IST
- East Godavari Tragedy : అమెరికాలో ఏపికి చెందిన యువకుడు మృతి చెందారు. దీంతో ఆ యువకుడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
Tue, 24 Sep 202407:39 AM IST
- Certificates: బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. వరదల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం పాడైపోయాయి. దీంతో వారికి కొత్త సర్టిఫికెట్లను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిజి లాకర్‌లో శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
Tue, 24 Sep 202407:20 AM IST
- AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. 20మందితో తొలి జాబితా విడుదలైంది. ఎన్డీఏ కూటమి పార్టీలలో పదవులు దక్కిన వారిలో లో 16మంది టీడీపీ నాయకులు, ముగ్గురు జనసేన, ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు.
Tue, 24 Sep 202405:40 AM IST
- Janasena Pawan Kalyan: తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి నాణ్యత వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను తాను నిందించడం లేదని, కానీ తప్పు జరిగితే దానిని అంగీకరించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవన్ ప్రాయశ్చిత్తం చేపట్టారు.
Tue, 24 Sep 202405:05 AM IST
- Pawan Warns PraksahRaj: తిరుమల తిరుపతి లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యి వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్‌పై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులరిజం అంటే ఏమిటో తెలుసుకోవాలని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే తాను మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.
Tue, 24 Sep 202404:25 AM IST
- Flood Compansation: బుడమేరు వరద బాధితుల చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. బుడమేరు ఉగ్రరూపంతో సర్వం కోల్పోయిన బాధితుల్ని ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే అందులో రాజకీయ జోక్యంతో అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది.
Tue, 24 Sep 202403:43 AM IST
- Anantapur Accident : అనంతపురం జిల్లాలో రోడ్డు జరిగింది. కూతుళ్లు, మనవళ్లు సంతోషంగా గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న భార్య భర్తలు.. ఇంటికి చేరకుండానే అనంతలోకానికి చేరారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు.
Tue, 24 Sep 202402:58 AM IST
- POCSO Court: ఏలూరులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వరుసకు కుమార్తలయ్యే ఇద్దరి బాలికలపై లైంగికదాడికి పాల్పడిన సవతితండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష, నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా జీవితకాల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు తీర్పునిచ్చింది.
Tue, 24 Sep 202401:28 AM IST
- NTR Bharosa: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లపై ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెద్ద ఎత్తున అనర్హులకు సామాజిక పెన్షన్లు అందిస్తున్న నేపథ్యంలో అనర్హులు స్వచ్ఛంధంగా తమ పెన్షన్లను వదులుకోవాలని బాబు సూచించారు.
Tue, 24 Sep 202401:03 AM IST
- AP High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Tue, 24 Sep 202412:22 AM IST
Tirupati laddu row: తిరుపతి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది.