AP Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్-ఈ నెల 27, 30న ఈ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా-visakhapatnam tirupati nandikotkur mega job mela 1780 job vacancies register ap skill development website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్-ఈ నెల 27, 30న ఈ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా

AP Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్-ఈ నెల 27, 30న ఈ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా

Bandaru Satyaprasad HT Telugu
Sep 24, 2024 03:08 PM IST

AP Job Mela : విశాఖ, నందికొట్కూరు, తిరుపతిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 1780 పోస్టుల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు సూపర్ న్యూస్-ఈ నెల 27, 30న ఈ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా
నిరుద్యోగులకు సూపర్ న్యూస్-ఈ నెల 27, 30న ఈ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా

AP Job Mela : విశాఖ, నందికొట్కూరు, తిరుపతిలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 27న విశాఖ, తిరుపతిలో, 30న నందికొట్కూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

వివిధ ప్రైవేట్ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఈ నెల 27న విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐటిఐ ఫిట్టర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలకు హాజరుకావాలని తెలియజేశారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు గల నిరుద్యోగులు అర్హత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. విశాఖలో జరిగే జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలకు 9948768778 నంబర్ ని సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://employment.ap.gov.in/ వెబ్ సైట్ లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న శుక్రవారం ఉదయం 10.00 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా - మొత్తం పోస్టులు 800

  • జాబ్ మేళా తేదీ- 27/09/2024
  • ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్- బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ -150 ఖాళీలు- 12వ తరగతి/ఏదైనా డిగ్రీ అర్హత -వయోపరిమితి 18-32 - జీతం రూ.17500
  • డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ/ప్రొడక్షన్ ట్రైనీ- 280 పోస్టులు- డిగ్రీ అర్హత- వయోపరిమితి 18-25 - ఏడాదికి జీతం రూ.2.2 లక్షలు
  • HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్- బిజినెస్ ఎగ్జిక్యూటివ్ -150 ఖాళీలు- 12వ/ఏదైనా డిగ్రీ -వయోపరిమితి 18-30 - జీతం రూ.17000
  • SBB మెడికేర్ - సీనియర్ ఫార్మసిస్ట్/ సేల్స్ ఎగ్జిక్యూటివ్ - 100 ఖాళీలు- 10వ/12వ/ఫార్మసీ/ఏదైనా డిగ్రీ - వయోపరిమితి 18-40 - జీతం రూ.12000-18000
  • శ్రీరామ్ లిమిటెడ్ - బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ - 120 ఖాళీలు- ఏదైనా డిగ్రీ-వయోపరిమితి 18-25 - జీతం రూ.17500

నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల - మొత్తం పోస్టులు 680

  • జాబ్ మేళా తేదీ- 30/09/2024
  • అనంత ప్రాజెక్ట్‌లు - 30 ఖాళీలు (అర్హత డిగ్రీ- వయోపరిమితి 22-30 ఏళ్లు- జీతం రూ. 15 వేలు -25వేలు)
  • బ్లూ స్టార్ క్లైమాటిక్ లిమిటెడ్ - 100 ఖాళీలు( ఏదైనా డిగ్రీ/ఐటీఐ డిప్లొమా - వయోపరిమితి 19-28 ఏళ్లు- జీతం రూ.15 వేల నుండి 16 వేలు)
  • క్యూస్ కార్ప్ - 250 పోస్టులు( SSC, ఇంటర్, ఐటీటీ ఏదైనా డిగ్రీ - వయోపరిమతి 18-30 ఏళ్లు- జీతం రూ.15 వేల నుంచి 16 వేలు)
  • స్పందన స్పూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ - 150 పోస్టులు( ఇంటర్ ఏదైనా డిగ్రీ- వయోపరిమితి 18-29 ఏళ్లు - జీతం రూ.14 వేలు+TA+ఇన్సెంటివ్)
  • సుదర్శన్ లాబొరేటరీ ప్రై లిమిటెడ్- 150 పోస్టులు(ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీటీ & డిగ్రీ - వయోపరిమితి 18-45 ఏళ్లు - జీతం రూ.15 వేలు నుంచి 20 వేలు)

దరఖాస్తుకు ఈ లింక్ లపై క్లిక్ చేయండి

https://employment.ap.gov.in/LoginPage.aspx

సంబంధిత కథనం