Anganwadi Posts : అనంతపురం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు ఆఖ‌రు తేదీ అక్టోబర్ 1-anantapur anganwadi 94 posts notification application last date 1st october ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anganwadi Posts : అనంతపురం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు ఆఖ‌రు తేదీ అక్టోబర్ 1

Anganwadi Posts : అనంతపురం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు ఆఖ‌రు తేదీ అక్టోబర్ 1

HT Telugu Desk HT Telugu
Sep 24, 2024 05:16 PM IST

Anganwadi Posts : అనంతపురం జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళలు అక్టోబర్ 1 వ తేదీ లోపు దరఖాస్తులు దాఖలు చేయాలి. మొత్తం 84 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంగ‌న్‌వాడీ కార్యకర్త, అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు, మినీ అంగ‌న్‌వాడీ కార్యక‌ర్త పోస్టులను ప‌దో త‌ర‌గ‌తి అర్హత‌.

అనంతపురం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు ఆఖ‌రు తేదీ అక్టోబర్ 1
అనంతపురం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు ఆఖ‌రు తేదీ అక్టోబర్ 1

Anganwadi Posts : అనంతపురం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అక్టోబర్ 1 ఆఖ‌రు తేదీ కాగా, ఆ త‌రువాత ఇంట‌ర్వ్యూల‌ను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి వారి కార్యాల‌యం నుంచి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప‌రిధిలో ఖాళీగా ఉన్న అంగ‌న్‌వాడీ కార్యకర్త, అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు, మినీ అంగ‌న్‌వాడీ కార్యక‌ర్త పోస్టులను ప‌దో త‌ర‌గ‌తి అర్హత‌తో భ‌ర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం పోస్టులు 84

  • అంగ‌న్‌వాడీ వ‌ర్కర్‌ (ఏడ‌బ్ల్యూడ‌బ్ల్యూ) పోస్టులు-9
  • అంగ‌న్‌వాడీ హెల్పర్ (ఏడ‌బ్ల్యూహెచ్‌) పోస్టులు-71
  • మినీ అంగ‌న్‌వాడీ వ‌ర్కర్ (మినీ ఏడ‌బ్ల్యూడ‌బ్ల్యూ) -04

ఈ ఉద్యోగుల‌కు స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మ‌హిళలు అర్హులు. కాబ‌ట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు. అర్హత గ‌త వారు అక్టోబ‌ర్ 1 తేదీలోపు సంబంధిత సీడీపీఓ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారి వారి కార్యాల‌యం, అనంత‌పురం జిల్లా.

అంగ‌న్‌వాడీ కార్యక‌ర్త ఉద్యోగాల‌కు ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేయ‌డం త‌ప్పనిస‌రి. అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు, మినీ అంగ‌న్‌వాడీ కార్యక‌ర్త ఉద్యోగాల‌కు ఏడో త‌ర‌గ‌తి అర్హత ఉన్న వారు అర్హులు. క‌నీస వ‌య‌స్సు 21 సంవ‌త్సరాలు, గ‌రిష్ఠ వ‌య‌స్సు 35 సంవ‌త్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు క‌లిగిన అభ్యర్థి లేక‌పోయిన‌ట్లుయితే 18 సంవ‌త్సరాలు నిండిన వారి అప్లికేష‌న్ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

జీతం

అంగ‌న్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, అంగ‌న్‌వాడీ స‌హాయ‌కుల‌కు రూ.7,000 నెల జీతం ఉంటుంది. ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి ప‌రీక్ష లేదు. ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాల‌యంలో త‌మ అప్లికేష‌న్ అంద‌జేయాలి. బ‌యోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత, ఇత‌ర స‌ర్టిఫికేట్లు జెరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యంలో అప్లికేష‌న్ అంద‌జేయాలి.

పూర్తి వివ‌రాలు కావాల‌నుకునే అభ్యర్థులు ఈ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2024/09/2024092354.pdf క్లిక్ చేస్తే అందులో రిజ‌ర్వేష‌న్‌, అర్హత‌ల వంటి అన్ని వివ‌రాలు ఉంటాయి. అలాగే ఆ లింక్‌లోనే ద‌ర‌ఖాస్తు ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసికుని, పూర్తి చేసి, దానికి సంబంధిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్లికేష‌న్‌ను అక్టోబ‌ర్ 1 తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు అంద‌జేయాల్సి ఉంటుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం