IRCTC Dwarka Package : మూడు జ్యోతిర్లింగాలు, ద్వారకా తీర్థయాత్ర- బెంగళూరు నుంచి ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ-bangalore to dwarka covering three jyotirlinga temples irctc 8 days tour package ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Dwarka Package : మూడు జ్యోతిర్లింగాలు, ద్వారకా తీర్థయాత్ర- బెంగళూరు నుంచి ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ

IRCTC Dwarka Package : మూడు జ్యోతిర్లింగాలు, ద్వారకా తీర్థయాత్ర- బెంగళూరు నుంచి ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ

Bandaru Satyaprasad HT Telugu
Sep 24, 2024 01:31 PM IST

IRCTC Dwarka Darshan Package : బెంగళూరరు నుంచి ఐఆర్సీటీసీ ద్వారకా దర్శన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగ, సోమనాథ్, త్రయంబకేశ్వర్ మూడు ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు ద్వారకా కవర్ చేస్తూ 8 రోజులపాటు తీర్థయాత్ర సాగనుంది. తదుపరి పర్యటన తేదీ సెప్టెంబర్ 28.

మూడు జ్యోతిర్లింగాలు, ద్వారకా తీర్థయాత్ర- బెంగళూరు నుంచి ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్
మూడు జ్యోతిర్లింగాలు, ద్వారకా తీర్థయాత్ర- బెంగళూరు నుంచి ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్

IRCTC Dwarka Darshan Package : కర్ణాటక ప్రభుత్వం, ఐఆర్సీటీసీతో కలిసి గుజరాత్, మహారాష్ట్రలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ, సోమనాథ్, త్రయంబకేశ్వర్ ప్రముఖ జ్యోతిర్లింగాలు, ద్వారకా ను కవర్ చేసేలా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అందుబాటులోకి తెచ్చింది. కర్ణాటక భారత్ గౌరవ్ ద్వారకా దర్శన్ పేరు ఈ తీర్థయాత్ర ప్యాకేజీ అందిస్తున్నారు. ఐఆర్సీటీసీ 08 రోజుల టూర్ ప్యాకేజీని రూ.15 వేల ప్రారంభ ధరతో అందిస్తోంది.

టూర్ ముఖ్యాంశాలు

  • టూర్ పేరు: " కర్ణాటక భారత గౌరవ్ ద్వారకా దర్శన్ "
  • టూర్ వ్యవధి : 07 రాత్రులు/08 రోజులు
  • బయలుదేరే తేదీ : 28/09/2024
  • పర్యటన ధర : రూ. 20,000(ఒక వ్యక్తికి)
  • ప్రత్యేక ఆఫర్: రూ. 5,000 (కర్ణాటక ప్రభుత్వ సబ్సిడీ)

పర్యటన ఇలా : బెంగళూరు - ద్వారకా ధీష్ ఆలయం - బేట్ ద్వారకా - నాగేశ్వర్ జ్యోతిర్లింగ - సోమనాథ్ ఆలయం -త్రయంబకేశ్వర్ - బెంగళూరు

బోర్డింగ్ పాయింట్లు: ఎస్ఎమ్వీటీ బెంగళూరు , తుమకూరు, బీరూర్, దావణగెరె, హవేరి, హుబ్బల్లి & బెల్గాం.

సందర్శన ప్రదేశాలు

  • ద్వారకా : ద్వారకాధీష్ ఆలయం, బేట్ ద్వారకా & నాగేశ్వర్ జ్యోతిర్లింగ
  • సోమనాథ్ : సోమనాథ్ ఆలయం.
  • నాసిక్ : త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం

1వ రోజు : మధ్యాహ్నం బెంగళూరు నుంచి రైలు బయలుదేరుతుంది. సంబంధిత బోర్డింగ్ స్టేషన్లలో పర్యాటకుల బోర్డింగ్ ఉంటుంది. లంచ్, ఈవెనింగ్ టీ, డిన్నర్ ఆన్‌బోర్డ్ లోనే, ఓవర్‌నైట్ ట్రైన్ జర్నీ చేస్తారు.

2వ రోజు : రైలు ప్రయాణం

3వ రోజు : ఉదయం ద్వారకా రైల్వే స్టేషన్ చేరుకుంటారు. పర్యాటకులను హోటల్ తీసుకెళ్తారు. ద్వారకాలో రాత్రి బస ఉంటుంది.

4వ రోజు : బ్రేక్ ఫాస్ట్ తర్వాత ద్వారకా ధీష్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం బేట్ ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. రాత్రి ద్వారకా నుంచి రైలు బయలుదేరుతుంది.

5వ రోజు : ఉదయం సోమనాథ్ చేరుకుంటారు. పర్యాటకులను హోటల్‌లకు తీసుకెళ్తారు. అల్పాహారం తర్వాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం సోమనాథ్ నుంచి రైలు బయలుదేరుతుంది.

6వ రోజు : మధ్యాహ్నం నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రికి నాసిక్‌లో బస చేస్తారు.

7వ రోజు : అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్అవుట్ చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం నాసిక్ రోడ్ స్టేషన్ ను నుంచి రైలు బయలుదేరుతుంది.

8వ రోజు : సాయంత్రానికి బెంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో సంతోషకరమైన జ్ఞాపకాలతో పర్యటన ముగుస్తుంది.