Andhra Pradesh News Live October 14, 2024: AP Liquor Shops Lottery : ఏపీలో లిక్కర్ క్వీన్స్- 345 షాపులు దక్కించుకున్న మహిళలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 14 Oct 202405:23 PM IST
AP Liquor Shops Lottery : ఏపీలో మద్యం షాపుల లాటరీలో మహిళలు పోటీ పడ్డారు. రాష్ట్రంలోని 3396 మద్యం షాపుల్లో 345 దుకాణాలను మహిళలు దగ్గించుకున్నారు. అత్యధికంగా విశాఖలో 31 షాపులు మహిళలకు దక్కాయి. శ్రీసత్యసాయి జిల్లాలో మద్యం షాపు దక్కించున్న వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేశారు.
Mon, 14 Oct 202403:51 PM IST
AP Schools Holiday : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు.
Mon, 14 Oct 202402:08 PM IST
Ration Card Status : ఏపీలో బియ్యం కార్డు ఉన్నప్పటికీ కొంత మందికి రేషన్ దక్కడంలేదు. అయితే అసలు తమకు ఎందుకు రేషన్ రావడంలేదో తెలియక వినియోగదారులు అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఆన్ లైన్ లో రేషన్ కార్డు యాక్టివ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Mon, 14 Oct 202412:42 PM IST
IAS Officers : ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నలుగురు ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
Mon, 14 Oct 202412:24 PM IST
TTD Alert On Tirupati Rains : రానున్న 48 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అక్టోబర్ 15న సిఫార్సు లేఖలు తీసుకోమని ప్రకటించింది.
Mon, 14 Oct 202411:47 AM IST
AP Liquor Lottery : ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ పూర్తైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లక్కీ డ్రా మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయితే లాటరీలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. మరోచోట ఒకే వ్యక్తి 5 షాపు దక్కాయి.
Mon, 14 Oct 202411:33 AM IST
- East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమని అడిగినందుకు తండ్రి, కుమార్తెపై ఒక వ్యక్తి దాడి చేశాడు. తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసేందుకు వచ్చారని, ఆత్మ రక్షణ కోసమే ప్రతిఘటించానని నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Mon, 14 Oct 202410:31 AM IST
- AP Liquor Shop Lottery 2024 : ఏపీలో వైన్ షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. 3,396 షాపులకు లాటరీ ప్రక్రియ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. చాలా చోట్ల జాతరను తలపించేలా లాటరీ ప్రక్రియ కొనసాగింది. ఎల్లుండి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
Mon, 14 Oct 202409:30 AM IST
- Pawan Kalyan : చంద్రబాబు అపార అనుభవం రాష్ట్ర అభివృద్ధికి కీలకం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో మాట్లాడిన పవన్.. వచ్చే ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పవన్ స్పీచ్‌లో 10 ముఖ్యాంశాలు ఇవే.
Mon, 14 Oct 202409:12 AM IST
Tatkal Passport Apply Online : అత్యవసర పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో పాస్ పోర్ట్ పొందేందుకు... తత్కాల్ పాస్ పోర్ట్ విధానం ఉపయోగపడుతుంది. తత్కాల్ పాస్ పోర్టును ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే ఇంటర్వ్యూ అయిన వారం రోజుల్లో పాస్ పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది.
Mon, 14 Oct 202408:51 AM IST
- Vijayawada Railway Security: ఏటా కోటి 69 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రత కరువైంది. విజయవాడ జిఆర్పీ స్టేషన్‌కు 70మంది పోలీసుల్ని కేటాయిస్తే అందులో 17మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.ఆదాయం తప్ప భద్రత గురించి ప్రభుత్వానికి పట్టడం లేదు.
Mon, 14 Oct 202407:17 AM IST
- CM Review On Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.
Mon, 14 Oct 202406:55 AM IST
- IPS Officers : ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా నిలిచారు. ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నాని స్పష్టం చేశారు.
Mon, 14 Oct 202402:20 AM IST
- Schools Holiday: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కావలి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరుపతిలో భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Mon, 14 Oct 202401:19 AM IST
- Ganja Cultivation: ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కేంద్రంగా ప్రాంతంలో వారి ఉనికి కూడా లేకుండా చేసిన ఏపీ పోలీసులు గంజాయి సాగు విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నారు.దేశం మొత్తానికి ఏపీ నుంచి గంజాయి సరఫరా అవుతోందన్న అపకీర్తిని మూటగట్టుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
Mon, 14 Oct 202412:54 AM IST
- Ys Jagan On Sand: రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిలదీశారు. ఇసుక ద్వారా వచ్చే డబ్బంతా ఎక్కడికి వెళుతోందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఖజానాకు డబ్బులు వచ్చేవని ఇప్పుడు ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోందని నిలదీశారు.
Mon, 14 Oct 202412:14 AM IST
- AP Rains Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.