Ration Card Status : బియ్యం కార్డు ఉండి రేషన్ రావటం లేదు? అయితే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Ration Card Status : ఏపీలో బియ్యం కార్డు ఉన్నప్పటికీ కొంత మందికి రేషన్ దక్కడంలేదు. అయితే అసలు తమకు ఎందుకు రేషన్ రావడంలేదో తెలియక వినియోగదారులు అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఆన్ లైన్ లో రేషన్ కార్డు యాక్టివ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

బియ్యం కార్డు ఉన్నప్పటికీ కొంత మందికి రేషన్ రావటంలేదు. చిన్న చిన్న పొరపాట్లతో రేషన్ వారికి దక్కటం లేదు. ఆ పొరపాట్లను గుర్తించడానికి, తమకు ఎందుకు రేషన్ ఇవ్వటం లేదో తెలుసుకోవడానికి సంబంధిత అధికారుల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తుంది. అయితే అసలు ఎందుకు రేషన్ ఇవ్వటం లేదో అధికారులు తమకు స్పష్టంగా చెప్పడంలేదని కార్డుదారులు చెబుతున్నారు.
రేషన్ కార్డు ఉండి, రేషన్ రాకపోతే అందుకు గల కారణాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే https://epos.ap.gov.in/ ఈ లింక్‌లో సెర్చ్ చేసినప్పుడు కార్డులో ఉండే వారి పేరు, రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దీంతో రైస్ కార్డు అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఈ https://epos.ap.gov.in/ లింక్ ఉపయోగించి కొత్త రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి ఆక్టివ్ అయిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. మొదటిగా https://epos.ap.gov.in/ ను క్లిక్ చేయాలి. లేదంటే eposap టైప్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. వెబ్‌సైట్‌లో HOME బటన్ పక్కనే ఉన్న REPORT బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు అందులో ఎనిమిది ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటి ఆప్షన్ MIS ను క్లిక్ చేయాలి. అందులో 17 ఆప్షన్స్ ఉంటాయి. పై నుంచి 12 అప్షన్, కింద నుంచి ఆరో ఆప్షన్ Ration card/ Rice card search కనిపిస్తోంది. దాన్ని క్లిక్ చేయాలి.
అక్కడ రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతూ సెర్చ్ (Search)బాక్స్ ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్‌లో పాత రేషన్ కార్డు నెంబర్ లేదా కొత్త రైస్ కార్డు నెంబర్ నమోదు చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు వెంటనే జిల్లా పేరు, మండలం పేరు, సచివాలయం పేరు, కొత్త రైస్ కార్డు నెంబర్, పాత రైస్ కార్డు నెంబర్, పేరు, కార్డు స్టేటస్ డిస్‌ప్లే అవుతాయి. దీంతో రైస్ కార్డు ఉన్నప్పటికీ, రైస్ ఎందుకు ఇవ్వటం లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో 29,796 రేషన్ షాపులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,48,43,671 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు వేల రేషన్ షాపులను పెంచేందుకు యోచిస్తోంది. అలాగే ఇంటింటి రేషన్ వాహనాలను కూడా నిలిపి వేసి, పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం