Tatkal Passport Apply:తత్కాల్ పాస్ పోర్ట్ ఆన్ లైన్ దరఖాస్తు విధానం-అన్నీ కరెక్ట్ గా ఉంటే వారం రోజుల్లోనే పాస్ పోర్ట్
Tatkal Passport Apply Online : అత్యవసర పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో పాస్ పోర్ట్ పొందేందుకు... తత్కాల్ పాస్ పోర్ట్ విధానం ఉపయోగపడుతుంది. తత్కాల్ పాస్ పోర్టును ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే ఇంటర్వ్యూ అయిన వారం రోజుల్లో పాస్ పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది.
Tatkal Passport Apply Online : అత్యవసర పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో పాస్ పోర్ట్ పొందేందుకు... తత్కాల్ పాస్ పోర్ట్ విధానం ఉపయోగపడుతుంది. తత్కాల్ పాస్ పోర్టును ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే ఇంటర్వ్యూ అయిన వారం రోజుల్లో పాస్ పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది.
విదేశాలకు వెళ్లే ప్రతీ ఒక్కరికి పాస్ పోర్ట్ చాలా కీలకం. అయితే అత్యవసర పరిస్థితుల్లో...అతి తక్కువ సమయంలో పాస్ పోర్ట్ పొందాలంటే 'తత్కాల్ పాస్ పోర్ట్' ఉపయోగపడుతుంది. తత్కాల్ పాస్ పోర్ట్ కు అవసరమయ్యే డాక్యుమెంట్స్, దరఖాస్తు ప్రక్రియ చాలావరకు సాధారణ పాస్‌పోర్ట్‌ల మాదిరిగానే ఉన్నప్పటికీ, దరఖాస్తుదారులు తత్కాల్ విధానానికి కింద డాక్యుమెంట్స్ అదనంగా సమర్పించాల్సి ఉంటుంది.
తత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులను ఆన్ లైన్ లో పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ద్వారా సమర్పించాలి. అనంతరం దరఖాస్తుదారులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అనంతరం పాస్‌పోర్ట్ మంజూరవుతుంది.
తత్కాల్ పాస్‌పోర్ట్ అంటే?
తత్కాల్ పాస్‌పోర్ట్ అనేది భారతదేశంలో పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి రూపొందించిన ఓ ప్రక్రియ. తక్కువ సమయంలో పాస్‌పోర్ట్‌ను పొందేందుకు వీలు కల్పించారు. అత్యవసరంగా విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తే ఈ విధానం ఉపయోగపడుతుంది.
తత్కాల్ పాస్ పోర్ట్ దరఖాస్తు విధానం దశల వారీగా
తత్కాల్ పాస్‌పోర్ట్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడం కోసం ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, ఫీజులు చెల్లించాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.
Step 1: దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ సేవా అధికారిక వెబ్ సైట్ https://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink# పై క్లిక్ చేయండి.
Step 2 : హోంపేజీలో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి దరఖాస్తుదారుడి వివరాలు, ఈ-మెయిల్ ఐడీతో నమోదు చేసుకోండి.
Step 3 : రిజిస్ట్రేషన్ తర్వాత పాస్‌పోర్ట్ పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. హోమ్‌పేజీలో ' డౌన్‌లోడ్ ఇ-ఫారమ్ ' పై క్లిక్ చేసి అనంతరం 'ఫ్రెష్ పాస్‌పోర్ట్ ' ఆప్షన్ ఎంచుకోండి Step 4 : ఆ తర్వాత మోడ్‌లో ' తత్కాల్' ఎంచుకోండి.
Step 5 : డౌన్‌లోడ్ చేసిన ఈ-ఫారమ్‌లో వివరాలు నమోదు చేయాలి. వ్యాలిడేట్ చేసి, సేవ్ చేయండి. అనంతరం XML ఫైల్ జనరేట్ అవుతుంది.
Step 6 : ఆ తర్వాత 'అప్‌లోడ్ ఈ-ఫారమ్' ఆప్షన్ కు వెళ్లి XML ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
Step 7 : పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి 'పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ ' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 8 : పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకుని అపాయింట్మెంట్ను బుక్ చేసుకోండి. అనంతరం ఫీజు చెల్లించండి.
Step 9 : అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా అపాయింట్‌మెంట్ నంబర్ ఉన్న అప్లికేషన్ రసీదు జనరేట్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకోండి.
Step 10 : ప్రింటెడ్ అప్లికేషన్ ఫారమ్, ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
ఆన్ లైన్ అప్లికేషన్ విధానం
Step 1: పాస్‌పోర్ట్ పోర్టల్‌కి లాగిన్ చేసి 'ఫ్రెష్ పాస్‌పోర్ట్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 2 : తత్కాల్ మోడ్‌ని ఎంచుకోండి.
Step 3 : ఆన్‌లైన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేయండి.
Step 4 : పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేందుకు ' పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ ' క్లిక్ చేయండి.
Step 5 : పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఎంచుకుని అపాయింట్మెంట్ను బుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫీజు చెల్లించండి.
Step 6 : అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా అపాయింట్‌మెంట్ నంబర్ తో అప్లికేషన్ రసీదును ప్రింట్ అవుట్ తీసుకోండి.
Step 7 : ప్రింటెడ్ అప్లికేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో పాస్ పోర్టు సేవా కేంద్రంలో ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
తత్కాల్ పాస్ పోర్ట్ దరఖాస్తుకు అర్హతలు
ఈ విధానంలో పాస్‌పోర్ట్ జారీకి పాస్‌పోర్ట్ కార్యాలయానిదే తుది నిర్ణయం. దరఖాస్తుదారుడి అత్యవసర పరిస్థితి మేరకు పాస్ పోర్టు జారీ చేస్తారు. ఈ కింది వర్గాలలోకి వచ్చే దరఖాస్తుదారులు తత్కాల్ ప్రోగ్రామ్ కింద పాస్‌పోర్ట్ కు అర్హులు కాదు.
1. భారతదేశానికి చెందిన తల్లిదండ్రులకు విదేశాల్లో పుట్టిన సంతానం
2. నాచురలైజేషన్ ద్వారా పౌరసత్వ హోదా పొందినవారు
3. విదేశాల నుంచి బహిష్కరణకు గురై భారత్ లో నివసించేవారు
4. విదేశాల నుంచి భారత్ కు ప్రభుత్వం రప్పించిన వ్యక్తులు
5. ప్రధానమైన పేరు మార్పు
6. నాగాలాండ్జమ్ము, కశ్మీర్ కు చెందిన పౌరులు, నాగాలాండ్‌లో నివసించే మైనర్లు
7. నాగాలాండ్ బయట నివసించే నాగా తెగకు చెందిన వారు
8. దత్తత తీసుకున్న పిల్లలు
9. తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఉన్న మైనర్లు
10. షార్ట్ పాస్ పోర్డు వ్యాలిడిటీతో మళ్లీ దరఖాస్తు చేసుకునేవారు
11. పాస్‌పోర్టు పోగొట్టుకున్నారు
12. గుర్తు పట్టలేని విధంగా పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయితే
13. లింగ మార్పిడి చేయించుకున్న వారు
14. సంతకం సహా తమ వ్యక్తిగత వివరాలు మార్చుకున్న వ్యక్తులు
తత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు
- అనెక్సర్-F ప్రకారం ధృవీకరణ సర్టిఫికేట్
- ఓటర్ ఐడీ కార్డు
- సర్వీస్ ఐటీ కార్డు
- SC/ST/OBC సర్టిఫికెట్
- స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు
- ఆయుధ లైసెన్స్
- రేషన్ కార్డు
- ఆస్తి పత్రాలు
- పెన్షన్ పత్రాలు
- రైల్వే ఫొటో గుర్తింపు కార్డు
- పాన్ కార్డు
- బ్యాంక్ పాస్ బుక్
- గుర్తింపు పొందిన సంస్థ నుంచి విద్యార్థి ఐడీ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- బర్త్ సర్టిఫికేట్
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
తత్కాల్ పాస్‌పోర్ట్ జారీకి ఎంత టైం పడుతుంది?
తత్కాల్ పాస్ పోర్టు అప్లికేషన్ సాధారణ అప్లికేషన్ కంటే తొందరగా ప్రాసెస్ చేస్తారు. దరఖాస్తుదారుడు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన ఒక వారం తర్వాత పాస్‌పోర్ట్‌లు పొందవచ్చు. ఈ విధానంలో ముందస్తు అపాయింట్‌మెంట్‌ని కలిగి ఉంటే ప్రత్యేక క్యూ ద్వారా ప్రాసెసింగ్ వేగంగా చేస్తారు. దరఖాస్తుదారులపై ఎలాంటి పోలీస్ కేసులు లేకపోతే.. పోలీసు వెరిఫికేషన్ పూర్తై వారం రోజుల్లో పాస్ పోర్టు ఇంటికి వచ్చేస్తుంది.
సంబంధిత కథనం