Passport issues : విదేశీ ట్రిప్​లో పాస్​పోర్ట్​ పోతే? టెన్షన్​ పడకుండా ఇలా చేయండి..-lost indian passport abroad heres how to handle the situation online without hassle ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Passport Issues : విదేశీ ట్రిప్​లో పాస్​పోర్ట్​ పోతే? టెన్షన్​ పడకుండా ఇలా చేయండి..

Passport issues : విదేశీ ట్రిప్​లో పాస్​పోర్ట్​ పోతే? టెన్షన్​ పడకుండా ఇలా చేయండి..

Sharath Chitturi HT Telugu
Oct 14, 2024 07:29 AM IST

Lost Indian Passport : విదేశాల్లో ఉన్నప్పుడు మన పాస్​పోర్ట్​ని కోల్పోవడం ఒత్తిడితో కూడుకున్న విషయం. ఆ సమయంలో ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వీదేశాల్లో పాస్​పోర్ట్​ పోతే ఏం చేయాలి?
వీదేశాల్లో పాస్​పోర్ట్​ పోతే ఏం చేయాలి? (Pexels)

విదేశీ ప్రయాణాల కోసం పాస్​పోర్ట్​ చాలా ముఖ్యం. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందుగా అడిగే డాక్యుమెంట్స్​లో పాస్​పోర్ట్​ ఒకటి. కానీ తెలుసో, తెలియకో కొందరు పాస్​పోర్ట్​ని పోగొట్టుకుంటారు. ఆ తర్వాత టెన్షన్​ పడుతుంటారు. అయితే, ఈ విషయంలో టెన్షన్​ పడకుండా, అసలు ఏం చేయాలి? అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పరిస్థితి మీరు ఎప్పుడైనా ఎదుర్కోవాల్సి వస్తే, ఆ సమయంలో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేయండి..

మీ పాస్​పోర్ట్ పోయిందని లేదా దొంగతనానికి గురైందని గ్రహించిన తర్వాత, మీ మొదటి స్టెప్​.. పోలీసులకు నివేదికను దాఖలు చేయడం. మీరు దీన్ని సమీప పోలీస్ స్టేషన్​లో లేదా ఆన్​లైన్​ల చేయవచ్చు. ఇదొక అధికారిక రికార్డుగా పనిచేస్తుంది. ఇది ఎంబసీ విధానాలకు, కొత్త పాస్​పోర్ట్​ లేదా అత్యవసర సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరం. రికవరీ ప్రక్రియలో అధికారులు అభ్యర్థించవచ్చు కాబట్టి ఒరిజినల్ రిపోర్టును ఉంచుకోండి.

సమీపంలోని బారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి..

పోలీసు నివేదికను దాఖలు చేసిన తర్వాత , సమీపంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్​ని సంప్రదించండి. పోగొట్టుకున్న పాస్​పోర్ట్​లతో సహా విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులకు సహాయం చేయడానికి ఈ సంస్థలు సిద్ధంగా ఉంటాయి. కొత్త పాస్​పోర్ట్​ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ (ఈసీ) పొందడం ద్వారా వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు. ఇది తాత్కాలికంగా భారతదేశానికి తిరిగి వెళ్లడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

కొత్త పాస్​పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేయండి..

మీ అవసరాన్ని బట్టి, మీరు కొత్త పాస్​పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఎమర్జెన్సీ సర్టిఫికేట్​ను పొందొచ్చు.

  • కొత్త పాస్​పోర్ట్: మీరు కొత్త పాస్​పోర్ట్​ను ఎంచుకుంటే, ప్రాసెసింగ్​కు ఒక వారం పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రస్తుత చిరునామా రుజువు, పుట్టిన తేదీ రుజువు, పోలీసు నివేదికతో సహా అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • ఎమర్జెన్సీ సర్టిఫికేట్: మీరు త్వరగా భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయండి. ఈ తాత్కాలిక పత్రం ఇంటికి తిరిగి ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. కానీ మీరు వచ్చిన తర్వాత కొత్త పాస్​పోర్ట్​ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మీ వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోండి..

మీ పాస్​పోర్ట్ పోయినట్టైతే.. మీరు మీ వీసాని మళ్లీ అప్లై చేసుకోవాలి. వీసా జారీ చేసే దేశ రాయబార కార్యాలయంలో లేదా ఆన్​లైన్​ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట అవసరాలను తనిఖీ చేయండి. ఎందుకంటే అవి మారవచ్చు!

మీ విమానాన్ని రీషెడ్యూల్ చేసుకోండి..

మీరు మీ పత్రాలను త్వరగా పునరుద్ధరించలేకపోతే ప్రత్యామ్నాయ ప్రయాణ తేదీల గురించి చర్చించడానికి మీ విమానయాన సంస్థను సంప్రదించండి. ముఖ్యంగా పోలీసు రిపోర్టుతో వారు అనుమతి ఇవ్వొచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకోండి..

మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తే, నష్టాన్ని మీ ప్రొవైడర్​కి నివేదించండి. అప్లికేషన్ ఫీజులు, ఫ్లైట్ రీషెడ్యూల్ ఖర్చులతో సహా కోల్పోయిన డాక్యుమెంట్​లకు సంబంధించిన ఖర్చులను అనేక పాలసీలు కవర్ చేస్తాయి.

బీమా క్లెయిమ్​ల కోసం..

పోలీస్ రిపోర్ట్, పాస్​పోర్ట్ పోవడం కారణంగా చేసిన ఖర్చులకు సంబంధించిన ఏవైనా రశీదులతో సహా అన్ని సంబంధిత డాక్యుమెంట్ లను జాగ్రత్తగా ఉంచుకోండి. భవిష్యత్తులో అవసరం పడొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం