Hyderabad Regional Passport Office : పాస్‌పోర్ట్‌ల జారీలో 5వ స్థానంలో సికింద్రాబాద్
Hyderabad Regional Passport Office:పాస్ పోర్ట్ జారీలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్ పోర్టు లను జారీ చేసింది.
Secunderabad Regional Passport Office: పాస్ పోర్ట్ జారీలో దేశంలోనే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఐదవ స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి ( ఆర్ పీ ఓ ) జొన్నలగడ్డ స్నేహజ ప్రకటించారు. దేశంలోని మొత్తం 37 పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానంలో ముంబై,బెంగళూరు,లక్నో,చండీగఢ్ కార్యాలయాలు ఉన్నట్టు తెలిపారు. 2023 లో పాస్ పోర్ట్ కార్యాలయం అందిస్తున్న సేవలు గురించి జొన్నలగడ్డ స్నేహజ మీడియా సమావేశంలో వివరించారు.
ఇప్పటివరకు 7,85,485 పాస్ పోర్టు లు జారీ....
పాస్ పోర్ట్ కోసం మధ్యవర్తులను సంప్రదించి మోసపోవద్దని ఆమె ప్రజలకు సూచించారు. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్ పోరుల జారీ కోసం నూతన విధానాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్ట్ పోర్టు లు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో పోల్చితే ఈ ఏడాది 1,42,328 పాస్ పోర్టులు అత్యధికంగా జారీ చేశామని ఆమె పేర్కొన్నారు. దళారుల వ్యవస్థను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటునట్లు ఆమె ప్రకటించారు.
పుట్టిన తేదీని ఆధార్ ఆధారంగా పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ స్పష్టం చేశారు.పాస్ పోర్టు లు తాత్ కల్ విధానంలో జారీ చేసేందుకు కనీసం 4 నుంచి 5 రోజులు సమయం పడుతుంద్నారు.సాధారణ పాస్ పోర్ట్ లు జారీ చేయడానికి దాదాపు 22 రోజుల సమయం పడుతున్నట్టు ఆమె ప్రకటించారు.