CM Review On Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలపై సీఎం సమీక్ష, రాయలసీమలో దంచికొడుతున్న వానలు-low pressure in bay of bengal cms review on heavy rains torrential rains in rayalaseema ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Review On Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలపై సీఎం సమీక్ష, రాయలసీమలో దంచికొడుతున్న వానలు

CM Review On Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలపై సీఎం సమీక్ష, రాయలసీమలో దంచికొడుతున్న వానలు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 14, 2024 12:47 PM IST

CM Review On Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Review On Rains: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదైనట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ‌యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని, చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహంపై .పర్యవేక్షణ ఉంచాలని సీఎం సూచించారు.

అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని, ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని, వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలని, కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వివరించిన అధికారులు...రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా ఉంచినట్టు అధికారులు తెలిపారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని, నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని, బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదన్నారు.

Whats_app_banner