LIVE UPDATES
Andhra Pradesh News Live November 14, 2024: Vizianagaram MLC Election 2024 : విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రద్దు - కారణాలివే
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 14 Nov 202411:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram MLC Election 2024 : విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రద్దు - కారణాలివే
- విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉపఎన్నికపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు… నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న ఇందుకూరి రఘురాజునే ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
Thu, 14 Nov 202411:34 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Discount : సీనియర్ సిటిజన్స్‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ - 25 శాతం రాయితీ అమలుపై కీలక ఆదేశాలు
- సీనియర్ సిటిజన్స్‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 25 సీనియర్ సిటిజన్స్ రాయితీ అమలకు కీలక ఆదేశాలు ఇచ్చింది.రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్‌కు అయినా ఈ రాయితీ వర్తింప చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) స్పష్టం చేశారు.
Thu, 14 Nov 202410:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Legislative Council : శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఉగ్రరూపం
- AP Legislative Council : మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని ఫైర్ అయ్యారు. జగన్ కుటుంబం గురించి తాము ఏనాడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు సభకు రాలేదంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
Thu, 14 Nov 202408:46 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP LAWCET Counseling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు - సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం, ఇదిగో లింక్
- AP LAWCET Counseling 2024 Updates : ఏపీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 29వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Thu, 14 Nov 202406:57 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vja Murder Case: విజయవాడలో వైసీపీ ముఖ్య నాయకుడిపై హత్యాయత్నం కేసు.. భూకబ్జా ఆరోపణలు.. పరారీలో ఉన్నట్టు పోలీసుల ప్రకటన
- Vja Murder Case: వైసీపీ ముఖ్య నాయకుడు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.భూవివాదం నేపథ్యంలో స్థలం యజమానిపై సుపారీ ఇచ్చి హత్యాయత్నం చేశారనే ఆరోపణలపై పలువురిని అరెస్ట్ చేశారు.ఇందులో వైసీపీ ముఖ్య నాయకుడి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు.
Thu, 14 Nov 202405:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srireddy Letter: అందరికీ సారీ, నన్ను వదిలేయండి అంటూ శ్రీరెడ్డి లేఖలు, పలు జిల్లాల్లో కేసుల నమోదు
- Srireddy Letter: ఏపీలో సోషల్ మీడియాలో అసభ్య రాతలతో చెలరేగిపోతున్న వారిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో సినీనటి శ్రీరెడ్డి బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను క్షమించి వదిలేయాలని, ఇంకెప్పుడూ తప్పు చేయానంటూ మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.
Thu, 14 Nov 202405:50 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలకు వెళ్తే ఇవి తప్పనిసరి తీసుకెళ్లాలి
- Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది. శబరిమలకు వచ్చే భక్తులు ఆన్‌లైన్ టైమ్ స్లాట్‌లో రిజిష్టర్ చేసుకోవాలని సూచించింది. అలాగే యాత్రకు వచ్చే భక్తులు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకురావాలని స్పష్టం చేసింది.
Thu, 14 Nov 202405:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Welfare Pensions: ఏపీలో మూడు లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు, 2.5లక్షల దరఖాస్తుల పెండింగ్, త్వరలో ప్రక్షాళన
- AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు అందుతున్నట్టు గుర్తించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.
Thu, 14 Nov 202404:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Digital Life Certificate: పెన్షనర్లకు వరం.. ఐరిస్‌తో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, మొబైల్‌లోనే సమర్పించే అవకాశం
- Digital Life Certificate: కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు శుభవార్త.. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ ఫేస్ ఆర్‌డి ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటి నుంచి మొబల్ అప్లికేషన్ల ద్వారా ఆధార్‌లో నమోదైన ఐరిస్ ద్వారా జీవన్ ప్రమాణ్ సమర్పించవచ్చు.
Thu, 14 Nov 202404:00 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకనుంచి నిమిషంలోనే దర్శన టిక్కెటు
- Tirumala : టీటీడీ శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు సులభతరం చేసింది. మరోవైపు టీటీడీ అంగప్రదక్షిణం సేవా టిక్కెట్ల ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌లు అందుబాటులోకి తేనుంది. రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఆరు గంటలు మాత్రమే సమయం ఇచ్చింది.
Thu, 14 Nov 202403:20 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sabarimala Special Trains: ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు..
- Sabarimala Special Trains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్షాధారణ చేపట్టే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన పట్టణాల మీదుగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. నవంబర్ 17 నుంచి అందుబాటులోకి వస్తాయి.
Thu, 14 Nov 202401:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: RRR Nomination: డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష‌్ణంరాజు నామినేషన్, నేడు ఏకగ్రీవం కానున్న ఎన్నిక…
- RRR Nomination: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి. ఈ మేరకు మూడు పార్టీల నేతల సమక్షంలో రఘురామ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Thu, 14 Nov 202401:02 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రైల్వే లైన్ పునరుద్ధరణ, 24 గంటల్లో మరమ్మతులు
- Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రాఘవపూర్ వద్ద రైల్వే లైన్‌ను పునరుద్ధరించారు.రైల్వేశాఖ శరవేగంగా పనులు చేపట్టి రైల్వే లైన్ ను వినియోగంలోకి తెచ్చారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నె డిల్లీ ప్రధాన రైలు మార్గం, విద్యుత్ లైన్ ధ్వంసమయింది.20 రైళ్ళు రద్దయ్యాయి.
Thu, 14 Nov 202412:40 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Two Children Rule: స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు.. ఎన్నికల్లో పోటీకి తొలగిన అడ్డంకి
- Two Children Rule: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డంకిగా మారిన ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదం తెలిపింది.ఈ మేరకు మునిసిపల్, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది.ఇకపై స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరుపిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఉండదు.