Narayana Teaching: ఏపీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నారాయణ ఉచిత కోచింగ్, ఉత్తీర్ణత పెంచడమే లక్ష‌్యం-narayanas participation in ap government junior colleges with the aim is to increase pass rate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Narayana Teaching: ఏపీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నారాయణ ఉచిత కోచింగ్, ఉత్తీర్ణత పెంచడమే లక్ష‌్యం

Narayana Teaching: ఏపీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నారాయణ ఉచిత కోచింగ్, ఉత్తీర్ణత పెంచడమే లక్ష‌్యం

Narayana Teaching: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లెో ఉత్తీర్ణత శాతం పెంచడానికి నారాయణ విద్యా సంస్థలు శిక్షణా భాగస్వామ్యం అందిస్తాయని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు మంత్రి నారాయణ సూచనలు చేశారు.

జూనియర్ కాలేజీల్లో శిక్షణకు నారాయణ భాగస్వామ్యం

Narayana Teaching: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తీర్ణతా శాతం పెంచడానికి, పోటీ పరీక్షల్లో విద్యార్థులు నెగ్గేందుకు నారాయణ విద్యా సంస్థల సహకరిస్తాయని మంత్రి నారాయణ ప్రకటించారు. పోటీపరీక్షలకు శిక్షణతో పాటు అవసరమైన మెటిరియల్‌ కూడా అందిస్తానని ప్రకటించారు. వచ్చే ఈఏపీ సెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు నారాయణ సిబ్బంది సహకారంతో శిక్షణ అందిస్తామన్నారు.

ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేసిన మంత్రి నారాయణ. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని, అధ్యాపకులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థ‌లు నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు.ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారు.విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంట‌ర్ బోర్డు నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు.

ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్ట‌ర్ కృతికా శుక్లాతో పాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు,ఆర్ ఐవోలు, జిల్లా ఒకేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్లు,ఐదు రీజిన‌ల్ సెంట‌ర్ల‌లోని క‌ళాశాల‌ల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి, ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి, పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై మంత్రి నారాయణ అధ్యాపకులకు సూచనలు చేశారు.

గ‌తేడాది ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో విద్యార్ధులు సాధించిన మార్కుల‌ను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ‌, మార్కులు త‌గ్గ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌ని ఆరా తీసారు.ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని, దానికి త‌గ్గ‌ట్లుగానే విద్యార్ధుల‌కు అవ‌స‌ర‌మైన విధంగా విద్యాబోధ‌న చేయాల‌ని సూచించారు. విద్యార్దులు క్ర‌మం త‌ప్ప‌కుండా త‌ర‌గ‌తులకు హాజ‌ర‌య్యేలా చూడాల‌న్నారు.

ఈ ఏడాది ఈఏపీసెట్ రాసే విద్యార్ధుల‌కు నారాయ‌ణ విద్యాసంస్థ‌ల నుంచి కోచింగ్ మెటీరియ‌ల్ అందిస్తాన‌ని చెప్పారు. స్వ‌త‌హాగా లెక్క‌ల అధ్యాప‌కుడు అయిన మంత్రి నారాయ‌ణ‌ విద్యార్ధుల‌కు లెక్క‌లు ఎలా బోధించాల‌నే దానిపై వ‌ర్క్ షాప్ కు హాజ‌రైన అధ్యాప‌కుల‌కు ఉదాహ‌ర‌ణ‌ల‌తో వివ‌రించారు.