APSRTC Discount : సీనియర్ సిటిజన్స్‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ - 25 శాతం రాయితీ అమలుపై కీలక ఆదేశాలు
సీనియర్ సిటిజన్స్‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 25 సీనియర్ సిటిజన్స్ రాయితీ అమలకు కీలక ఆదేశాలు ఇచ్చింది.రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్‌కు అయినా ఈ రాయితీ వర్తింప చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. 25 సీనియర్ సిటిజన్స్ రాయితీ అమలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాయితీ అమలకు కోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది.
వాటిలో ఏ ఒక్కటి చూపించినా 25 శాతం సీనియర్ సిటిజన్స్ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్‌కు ఈ రాయితీ వర్తింప చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) తెలిపారు.
ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా 25 శాతం రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏదైనా పర్లేదు…!
సీనియర్ సిటిజన్స్ తమ వయస్సుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే సాఫ్ట్‌కాపీల్లో ఏవి చూపించినా వాటిని అనుమతించాలని పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహించబడే అన్ని రకాల బస్సుల్లో 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు కార్పొరేషన్ 25 శాతం రాయితీని పొడిగించిందని ఆదేశాల్లో తెలిపారు. ఇంకా టికెట్ కొనుగోలు సమయంలోనూ, వారి ప్రయాణ సమయంలోనూ సీనియర్ సిటిజన్ల నుండి భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపం (హార్డ్‌కాపీలు లేదా సాఫ్ట్ కాపీలు)లో వయస్సుకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపిస్తే సరిపోతుందని ఆదేశాల్లోపేర్కొన్నారు.
ఆరు కార్డుల్లో ఏదైనా ఉపయోగించొచ్చు…
సీనియర్ సిటిజన్స్ బస్సుల్లో 25 శాతం రాయితీని పొందడానికి ఆరు రకాల కార్డుల్లో ఏదైనా ఉపయోగించొచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు కార్డుల్లో ఏవైనా పర్వాలేదు. వాటిని అనుమతించాలని స్పష్టం చేశారు.
1. ఆధార్ కార్డు
4. ఓటరు గుర్తింపు కార్డు
2. సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్
5. పాస్‌పోర్టు
3. పాన్ కార్డు
6. రేషన్ కార్డు
ఈ ఆరు రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులను అనుమతించాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. దీన్ని అందరూ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.