Balakrishna: డాకు మహరాజ్‌గా బాలకృష్ణ - ఎన్‌బీకే 109 టీజర్ రిలీజ్ - అల్లు అర్జున్ మూవీ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
Balakrishna: బాలకృష్ణ 109వ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలు, ఎలివేషన్స్‌తో డాకు మహారాజ్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ను సంక్రాంతి జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Balakrishna: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ శుక్రవారం అనౌన్స్‌చేశారు. డాకు మహరాజ్ అనే పేరును ఫిక్స్‌చేశారు. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు…
ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు...చీకటిని శాసించే రాక్షసులది కాదు...ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు...ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది...గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది...మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ బాలకృష్ణకు ఇచ్చిన ఎలివేషన్ టీజర్‌లో ఆకట్టుకుంటోంది.
చివరలో డాకు మహారాజ్ అంటూ టైటిల్‌ను బాలకృష్ణ రివీల్ చేయడం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. గుర్రంపై పోరాట యోధుడిగా బాలకృష్ణ టీజర్‌లో కనిపించాడు. టీజర్‌లోని లోకేషన్స్, గుర్రాలు, ఎడారుల్లో స్వారీ చేయడం చూస్తుంటే కొత్త బ్యాక్‌డ్రాప్‌లో డాకు మహరాజ్ మూవీ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది.
సంక్రాంతికి రిలీజ్...
సంక్రాంతికి డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆదివారం రోజు డాకు మహారాజ్ రిలీజ్ అవుతోంది. గతంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనుబంధ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన అల వైకుంఠపురములో జనవరి 12 ఆదివారం రోజున ప్రేక్షకుల ముందుకొచ్చింది. సేమ్ అదే డేట్, ఆదివారం రోజునే డాకు మహారాజ్ రిలీజ్ కాబోతోంది.
అల్లు అర్జున్ మూవీ సెంటిమెంట్ డాకు మహరాజ్‌కు వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ భారీ బడ్జెట్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి ఫార్యూన్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తోన్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 109వ సినిమా ఇది.
ఇద్దరు హీరోయిన్లు...
ఇందులో యానిమల్ ఫేమ్, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.డాకు మహారాజ్ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
టీజర్ లాంఛ్ ఈవెంట్...
డాకు మహారాజ్ టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. సినిమాలో డూప్‌లు లేకుండా బాలకృష్ణ నటించాడని, టీజర్‌లో కనిపించినవన్నీ ఒరిజినల్ షాట్స్ అని బాబీ చెప్పాడు. బాలకృష్ణ కొత్త అవతారాన్ని ఈ మూవీలో చూస్తారని అన్నాడు. బాలకృష్ణతో తాను చేస్తోన్న ఐదో సినిమా ఇదని తమన్ అన్నాడు.
గేమ్ ఛేంజర్ కూడా...
బాలకృష్ణ డాకు మహారాజ్‌కు రెండు రోజుల ముందుగా రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర కూడా రిలీజ్ కావాల్సింది. గేమ్ ఛేంజర్ కోసం పండుగ రేసు నుంచి చిరంజీవి వెనక్కివెళ్లిపోయారు. బాలకృష్ణ, రామ్‌చరణ్ సినిమాలతో పాటు వెంకటేష్, అనిల్‌రావిపూడి కాంబోలో వస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతోంది.
అఖండ 2
డాకు మహారాజ్ తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేయబోతున్నాడు బాలకృష్ణ. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్‌గా అఖండ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనూ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్, అఖండ వచ్చాయి.