డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో(నవంబర్ 15, 2024)తో పూర్తి కానుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరికొద్దిగంటు మాత్రమే మిగిలి ఉంది.
పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేయాలి. ఇక డిప్లోమా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.
కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని ముఖ్య వివరాల కోసం వర్సిటీ హెల్ప్ లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590, 7382929600 సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం