Mirror Vastu Tips: ఉదయం లేవగానే అద్దంలో చూసుకునే వాళ్లకు ఈ తిప్పలు తప్పవట!
Mirror Vastu Tips: ఉదయాన్నే నిద్రలేవగానే అద్దంలో చూసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది అస్సలు మంచి పని కాదట. ఇలా చేయడం వల్ల జీవితంపై దుష్ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం మనకు తెలియకుండానే చేతులారా చాలా పనులు చేసుకుని ప్రమాదాలను కొని తెచ్చుకుంటాం. అటువంటి వాటిలో ఒకటి ఉదయం లేవగానే అద్దంలో చూసుకోవడం. ఉదయం లేవగానే తమ మొహం తాము చూసుకోవడం మంచిది కొందరు ఇతరులకు కనబడే ముందు మన మొహం, జుట్టు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని మరికొందరు అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఇది ముమ్మాటికీ చేయకూడని పని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాగే చేస్తూ పోతే శరీరకంగా, మానసికంగా దుష్ప్రభావం పడుతుందట. అద్దంలో మనల్ని మనం చూసుకోవడమనది ఎందుకు మంచిది కాదు. ఈ అలవాటు వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం రండి.
రాత్రంతా నెగిటివ్ ఎనర్జీ:
వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి సమయంలో పడుకున్న తర్వాత అద్దంలో నెగెటివ్ ఎనర్జీ భ్రమిస్తూ ఉంటుందట. మనకు తెలియకుండానే ఉదయం లేవగానే అద్దంలో మొహం చూసుకోగానే ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మన మీదకు వస్తుందట. ఫలితంగా రోజంతా అలసిపోయినట్లుగా లేదా చికాకుగా కనిపిస్తారట.
నిరాశ, అసంతృప్తి:
ఇంకో కారణమేంటంటే, ఉదయం లేవగానే అద్దంలో చూసుకున్న మనిషికి తగినంత విశ్రాంతి తీసుకోలేదన్న భావన కలుగుతుందట. మేల్కొన్న వెంటనే అద్దంలో చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే కనిపిస్తాం. ఆ సమయంలో మొహంపై ఉన్న మొటిమలు, ముడతలు, తెల్ల జుట్టు, మచ్చలు లాంటివి కనిపించి మనల్ని చికాకుకు గురి చేస్తాయి. ఫలితంగా మనపై మనకే సందేహం వచ్చి కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోయేలా చేస్తుంది. మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. నిరాశ, అసంతృప్తికి లోనవుతాం. వాస్తు శాస్త్రంలో కూడా అదే చెప్తుంది. ఎవరైతే వారి నీడను లేదా ప్రతిబింబాన్ని ఉదయం సమయంలో చూసుకుంటారో వారు దుష్ప్రభావాలు ఎదుర్కుంటారు.
వాస్తు జ్ఞానం ప్రకారం, అద్దం ఒక వస్తువు. అది పాజిటివ్ ఎనర్జీని, నెగెటివ్ ఎనర్జీని వేరు చేయలేదు. దానికి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో దానిని మాత్రం ప్రతిబింబిస్తుంది. అందుకే వాస్తు నిపుణులు ఇంట్లో వాస్తు సరిచేసే సమయంలో అద్దాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇవి మీ ఆరోగ్యం, సంపద, వృద్ధి లాంటి అంశాలపై కీలక ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే అద్దం వాడటం అనేది చాలా ముఖ్యం.
నమ్మకాలు, అనుభవాలు అనేవి వేర్వేరుగా ఉండొచ్చు.ఉదయం లేవగానే అద్దంలో చూసుకోకూడదని శాస్త్రం చెబుతుంది. అదే ఉదయం తమ మొహాన్ని తాము చూసుకోవడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. తమపై తమకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతుందనిపిస్తే అద్దంలో చూసుకోవడం తప్పేమీ కాదు. నమ్మకాల్ని ఆచరించడమనేది ఎవరిది వారికి వ్యక్తిగతమే.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్