Srireddy Letter: అందరికీ సారీ, నన్ను వదిలేయండి అంటూ శ్రీరెడ్డి లేఖలు, పలు జిల్లాల్లో కేసుల నమోదు-actor sri reddys letters saying sorry to all leave me cases registered in many districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srireddy Letter: అందరికీ సారీ, నన్ను వదిలేయండి అంటూ శ్రీరెడ్డి లేఖలు, పలు జిల్లాల్లో కేసుల నమోదు

Srireddy Letter: అందరికీ సారీ, నన్ను వదిలేయండి అంటూ శ్రీరెడ్డి లేఖలు, పలు జిల్లాల్లో కేసుల నమోదు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 14, 2024 11:22 AM IST

Srireddy Letter: ఏపీలో సోషల్‌ మీడియాలో అసభ్య రాతలతో చెలరేగిపోతున్న వారిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో సినీనటి శ్రీరెడ్డి బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను క్షమించి వదిలేయాలని, ఇంకెప్పుడూ తప్పు చేయానంటూ మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.

క్షమాపణలు చెబుతూ నటి శ్రీరెడ్డి లేఖలు
క్షమాపణలు చెబుతూ నటి శ్రీరెడ్డి లేఖలు

Srireddy Letter: ఏపీలో సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదవుతున్న నేేపథ్యంలో సినీ నటి శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో మంత్రి నారాలోకేష్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. తనను క్షమించాలని వాటిలో వేడుకున్నారు. రెండ్రోజుల క్రితం సోషల్‌ మీడియా పోస్టులపై క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో ఆమెపై పలు జిల్లాల్లో శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. దీంతో బహిరంగంగా క్షమాపణలు చెబుతూ లేఖను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

మంత్రి లోకేష్‌కు రాసిన లేఖలో ఫ్యామిలీ మీద ఒట్టేసి చెబుతున్నాఇప్పటి పరిస్థితుల నుంచి జారు కోవటానికి లెటర్‌ అనుకోవద్దని వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా ఎంతో మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయంగా రాసుకొచ్చింది. తన విషయంలో నొచ్చుకోవద్దని, భవిష్యత్తులో వైసీపీ తిరిగి వచ్చినా నా బుద్ది వక్రం తిరుగుతుందని అనుకోవద్దని వేడుకున్నారు.

ఇప్పటికి తాను, తన కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించామని తన ఇంట్లో పెళ్ళి కావాలసిన పిల్లలు ఉన్నారని, తనను కొడితే ఒక నెల లేదా 3 నెలలకు గాయాలు మానతాయని, తన వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసినదాన్ని అవుతానని పేర్కొన్నారు. సోషల్ మీడియా కేసుల నుంచి తనను బంధ విముక్తురాలిని చేయాలని, తన వల్ల బాధపడిన అందరికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఉన్నవారికి, చిరంజీవి, నాగబాబుకు క్షమాపణలు చెబుతున్నట్టు లేఖలో శ్రీరెడ్డి పేర్కొంది. షర్మిల, సునీతలను కూడా క్షమించమని లేఖలో శ్రీరెడ్డి అభ్యర్ధించింది.

జగన్‌కు మరో లేఖ…

వైసీపీ అధ్యక్షుడు, జగన్‌, భారతిలకు మరో లేఖను రాశారు. పార్టీతో తనకు సంబంధం లేకపోయినా పార్టీ మీద అభిమానంతో చేసిన పనుల వల్ల వారికి ఇబ్బందులు తెచ్చి పెట్టానని చెప్పారు. తన వల్ల పార్టీకి నష్టం జరిగిందని, పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Whats_app_banner