SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ - లక్నో మధ్య ప్రత్యేక రైళ్లు, వివరాలివే-south central railway runs special trains between secunderabad lucknow secunderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ - లక్నో మధ్య ప్రత్యేక రైళ్లు, వివరాలివే

SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ - లక్నో మధ్య ప్రత్యేక రైళ్లు, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 15, 2024 11:04 AM IST

South Central Railway Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్‌ నుంచి యూపీలోని లక్నోకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నవంబర్ 15, 22 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణలో పలు స్టేషన్లల్లో ఈ ట్రైన్స్ ఆగనున్నాయి.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్‌ నుంచి లక్నో వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 15, 22 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రైన్(నెంబర్ 07084) నవంబర్15వ తేదీన రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ రైలు నవంబర్ 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు లక్నోకు చేరుతుంది.

మరోవైపు నవంబర్ 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్ కు రైలు బయల్దేరుతుంది. నవంబర్ 18వ తేదీన ఉదయం 9.50 గంటలకు బయలుదేరుతుంది. నవంబర్ 20వ తేదీన సాయంత్రం 03 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

సికింద్రాబాద్ - లక్నో మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య స్టేషన్లల్లో ఆగుతుంది. ఈ రైళ్లల్లో 3 ఏసీ కోచ్ లు ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

1. ఈ ట్రైన్‌ నంబర్ 07131/07132 కాచిగూడ-కొట్టాయం రైలు నవంబర్ 17,24 తేదీల్లో కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మర్నాడు సాయంత్రం ఆరున్నరకు కొట్టాయం చేరుకుంటుంది.

ఈ రైలు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అవే స్టేషన్ల మీదుగా కాచిగూడకు వస్తుంది.

2. ట్రైన్‌ నంబర్‌ 07133/07134 కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ రైలు నవంబర్ 18,25 తేదీల్లో సోమవారం రాత్రి 8.50కు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొట్టాయం చేరుతుంది.

ఈ రైలు కాచిగూడ నుంచి షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పోడనూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలవా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా గమ్యస్థానం చేరుతుంది.

3. ట్రైన్ నంబర్ 07135/07136 హైదరాబాద్‌-కొట్టాయం-హైదరాబాద్‌ రైలు నవంబర్ 19, 26 తేదీలలో మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం నాలుగింటికి కొట్టాయం చేరుతుంది.

ఈ రైలు హైదరాాబాద్‌ నుంచి బయలుదేరి బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్‌, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

4. ట్రైన్ నంబర్ 07137/07138 సికింద్రాబాద్‌- కొట్టాయం-సికింద్రాబాద్‌ రైలు నవంబర్‌ 16, 23, 30వ తేదీల్లో ప్రతి శనివారం రాత్రి కొట్టాయంలో రాత్రి 9.45కు బయల్దేరి సోమవారం రాత్రి 12.50కు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌లో ఈ రైలు నవంబర్‌ 15,22, 29 తేదీల్లో బయలుదేరుతుంది.

ఈ రైలు సికింద్రాబాద్‌, మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది.

Whats_app_banner