Subbayya Mess: భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్‌పర్సన్‌ ఆగ్రహంతో కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్-centipede in lunch nhrc chairperson angered on subbaiah mess officials seized ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Subbayya Mess: భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్‌పర్సన్‌ ఆగ్రహంతో కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్

Subbayya Mess: భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్‌పర్సన్‌ ఆగ్రహంతో కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 15, 2024 08:39 AM IST

Subbayya Mess: విజయవాడ సుబ్బయ్యమెస్‌లో దారుణం జరిగింది. తినే ఆహారంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షం కావడంతో భోజనం చేస్తున్నవ్యక్తి ఖంగుతిన్నాడు. ఆ సమయంలో హోటల్లో భోజనం చేస్తున్న జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌ పర్సన్‌ విజయభారతి సయాని ఆదేశాలతో అధికారులు మెస్‌ను సీజ్ చేశారు.

విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ ఎదుట ఎన్‌హెచ్చార్సీ ఛైర్ పర్సన్
విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ ఎదుట ఎన్‌హెచ్చార్సీ ఛైర్ పర్సన్

Subbayya Mess: విజయవాడ నగరంలోని ప్రముఖ మెస్‌లో భోజనంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో అదే హోటల్లో జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ విజయభారతి సయాని భోజనం చేస్తుండటంతో అవాక్కయ్యారు. నగరంలోని ప్రముఖ భోజన శాల కావడంతో సిబ్బంది ఆమెను భోజనం చేయడానికి అక్కడకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో షాక్‌కు గురైన ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్‌ పర్సన్‌ ఆదేశాలతో హోటల్‌ను సీజ్ చేశారు.

విజయవాడలోని సుబ్బయ్య హోటల్లో ఓ వ్యక్తి గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో తినే ఆహారంలో కాలు జెర్రీ కనిపించింది. అదే హోటల్లో వ్యక్తిగత పనులపై విజయవాడ వచ్చిన కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్‌ విజయభారతి సయాని సిబ్బందితో కలిసి భోజనానికి వచ్చారు.

ఆ సమయంలో భోజనంలో జెర్రీ రావడంతో కస్టమర్‌ సిబ్బందిని నిలదీశాడు. గొడవను గమనించిన ఛైర్‌ పర్సన్ ఆరా తీయడంతో తినే ఆహారంలో కాళ్ల జెర్రీ వచ్చిందని విషయం వెళ్ళింది.

తినే ఆహారంలోకి కాళ్ల జెర్రీ ఎలా వస్తుంది, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు ఉండే ప్రదేశంలో ఘటన జరగడంతో జ్యూడిషియల్‌, రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించారు. జిల్లా ఉన్నతాధికారులకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ స్వయంగా ఫోన్‌ చేసి హోటల్‌పై ఫిర్యాదు చేవారు.

తాను భోజనం చేసే సమయంలో ఇదే హోటల్లో ఇక్కడ ఇటువంటి సంఘటన చోటు చోటు చేసుకుందని ప్రజల ఆహార భద్రతతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న సుబ్బయ్య హోటల్ యాజమాన్యం తీరుపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . దీంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

గురువారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ విజయ భారతి సయాని నగరంలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ లో భోజనాలలో కాలు జెర్రీ వచ్చిన విషయాన్ని కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సుబ్బయ్య హోటల్ నువ్వు వెంటనే సీట్ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.

సూర్యారావుపేట పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు హోటల్‌ ప్రాంతానికి చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం సుబ్బయ్య హోటల్ సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ స్థాయి ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్‌ విజయభారతి సయాని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Whats_app_banner