LIVE UPDATES
Andhra Pradesh News Live November 15, 2024: Annavaram : కన్నుల పండువగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తకోటి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 15 Nov 202403:52 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Annavaram : కన్నుల పండువగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తకోటి
- Annavaram : కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ రత్న, సత్యగిరుల చుట్టూ 9.2 కిలో మీటర్ల మేర సాగింది. ఈ ప్రదక్షిణలో తెలుగు రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. రద్దీ ప్రభావం దర్శనం, వ్రతాలపై పడింది.
Fri, 15 Nov 202402:36 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: IIT Madras with AP : ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు.. 8 ముఖ్యాంశాలు
- IIT Madras with AP : అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం, వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు.. ఐఐటీ మద్రాసుతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 8 విభాగాల్లో ఒప్పందాలు కుదిరాయి.
Fri, 15 Nov 202412:58 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Farmers : రైతులకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇకనుంచి ఆ సమస్య ఉండదు!
- AP Farmers : రాష్ట్రంలో ఖరీఫ్ కోతలు మొదలయ్యాయి. ముందుగా నాట్లు వేసిన పంటను కోసి ధాన్యం విక్రయించేస్తున్నారు. అయితే ఇంకా చాలామంది మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించలేదు. దీంతో మిల్లులు ఆన్‌లైన్ కాలేదు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
Fri, 15 Nov 202411:22 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Kartika Deepotsavam : నవంబరు 18న తిరుపతిలో 'కార్తీక దీపోత్సవం' - భారీగా ఏర్పాట్లు
- TTD Kartika Deepotsavam 2024: టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోవత్సవం జరగనుంది. నవంబర్ 18వ తేదీన తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Fri, 15 Nov 202411:16 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Schools : ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల్లో ఆ కార్యక్రమాలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
- AP Schools : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో రాజకీయ, మత, వివాహా కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటువంటి కార్యకలాపాల కోసం పాఠశాల ప్రాంగణాలల్లో అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Fri, 15 Nov 202409:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Andhra Pradesh Appulu : వామ్మో.. ఆంధ్రప్రదేశ్ నెత్తిమీద ఇన్ని అప్పులు ఉన్నాయా!
- Andhra Pradesh Appulu : ఏపీ అప్పుల గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఎక్కువని వ్యాఖ్యానించారు. అప్పులకు సంబంధించిన లెక్కలను చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 9 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది.
Fri, 15 Nov 202409:18 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sand Price Control: ఏపీలో తగ్గిన ఇసుక ధరలు, మార్కెట్లకి పోటెత్తిన ఇసుక.. విజయవాడలో ట్రాక్టర్ రూ.4వేలు
- Sand Price Control: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, మార్కెట్ విక్రయాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు కాస్త ఫలిస్తున్నాయి. ఈ ఏడాది కనిష్ట స్థాయికి ఇసుక ధరలు చేరుకున్నాయి. విజయవాడ మార్కెట్‌లో ట్రాక్టర్ ధర ఏడాది కనిష్టానికి చేరింది. నగరంలో నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులోకి వచ్చింది.
Fri, 15 Nov 202408:54 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: PawanKalyan: ఎన్డీఏ అభ్యర్థులు తరపున మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, 16,17తేదీల్లో రోడ్‌షోలు…
- PawanKalyan: ఎన్.డి.ఏ. అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయనున్నారు. రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటించనున్న పవన్ కళ్యాణ్ 5 సభలు… 2 రోడ్ షోలలో పాల్గొంటారు.
Fri, 15 Nov 202405:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Narayana Teaching: ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నారాయణ ఉచిత కోచింగ్, ఉత్తీర్ణత పెంచడమే లక్ష‌్యం
- Narayana Teaching: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లెో ఉత్తీర్ణత శాతం పెంచడానికి నారాయణ విద్యా సంస్థలు శిక్షణా భాగస్వామ్యం అందిస్తాయని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు మంత్రి నారాయణ సూచనలు చేశారు.
Fri, 15 Nov 202405:02 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh on AP Mega DSC: వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామన్న మంత్రి లోకేష్
- Lokesh on AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు.
Fri, 15 Nov 202404:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam Attack: విశాఖ జిల్లాలో ఘోరం… ప్రేమించలేదని యువతిపై జమ్మూ నుంచి వచ్చిన యువకుడి దాడి
- Visakhapatnam Attack: విశాఖపట్నం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించడానికి నిరాకరించిందని యువతిపై ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. జమ్మూ నుంచి విశాఖపట్నం వచ్చి రెక్కీ నిర్వహించి, హెల్మెట్ ధరించి రాడ్డుతో దాడి చేశాడు.అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి ఒడిగట్టాడు.
Fri, 15 Nov 202403:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Subbayya Mess: భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్‌పర్సన్ ఆగ్రహంతో కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్
- Subbayya Mess: విజయవాడ సుబ్బయ్యమెస్‌లో దారుణం జరిగింది. తినే ఆహారంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షం కావడంతో భోజనం చేస్తున్నవ్యక్తి ఖంగుతిన్నాడు. ఆ సమయంలో హోటల్లో భోజనం చేస్తున్న జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ విజయభారతి సయాని ఆదేశాలతో అధికారులు మెస్‌ను సీజ్ చేశారు.
Fri, 15 Nov 202401:38 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: UPSC Free Coaching: బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తులు..
- UPSC Free Coaching: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్‌కు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లిఖార్జున ప్రకటించారు. ఏపీస్టడీ సర్కిల్‌లో కోచింగ్ అందిస్తారు.
Fri, 15 Nov 202401:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ముహుర్తం ఖరారు…
- NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభ సమావేశాల్లో కొత్త పెన్షన్ల జారీపై పలువురు సభ్యులు ప్రస్తావించడంతో త్వరలో జారీ చేయనున్నట్టు సెర్ప్ మంత్రి వివరణ ఇచ్చారు. అనర్హుల ఏరివేత ప్రక్రియను కూడా చేపడుతున్నారు.