Best retro bike : ఇది కదా అసలు సిసలైన రెట్రో బైక్​ అంటే! యువతకు పిచ్చెక్కించే డిజన్​తో..-2025 indian scout sixty range unveiled to arrive in india by january 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Retro Bike : ఇది కదా అసలు సిసలైన రెట్రో బైక్​ అంటే! యువతకు పిచ్చెక్కించే డిజన్​తో..

Best retro bike : ఇది కదా అసలు సిసలైన రెట్రో బైక్​ అంటే! యువతకు పిచ్చెక్కించే డిజన్​తో..

Sharath Chitturi HT Telugu
Nov 15, 2024 11:15 AM IST

యువతకు పిచ్చెక్కించే డిజైన్​, లుక్స్​తో సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్​​ ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్నాయి. వీటితో ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ ఇండియాలో రీ-లంచ్​ అవుతోంది. ఆ వివరాలు..

The 2025 Indian Scout Sixty range gets two models and a redesigned 999 cc V-twin powerplant that has been made smaller to accommodate riders of varying levels of experience.
The 2025 Indian Scout Sixty range gets two models and a redesigned 999 cc V-twin powerplant that has been made smaller to accommodate riders of varying levels of experience. (Indian Motorcycles)

ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ ఇండియాలో రీ-లంచ్​ అవుతోంది! అదిరిపోయే రెట్రో లుక్స్​తో రెండు కొత్త బైక్స్​ని జనవరి 2025లో సంస్థ లాంచ్​ చేయనుంది. వీటి పేర్లు స్కౌట్​ సిక్స్​టీ క్లాసిక్​, స్కౌట్​ సిక్స్​టీ బాబర్​. ఇవి యూరో5+ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త ఇంజిన్​తో వస్తున్నాయి. రెండు బైక్స్​ ఆధునిక ఫీచర్లు, కొత్త డిజైన్​ని కలిగి ఉన్నాయి.

స్కౌట్ సిక్స్​టీ క్లాసిక్ యూఎస్ తయారీదారుకు చెందిన సిగ్నేచర్ ఫ్లేర్డ్ ఫెండర్లతో పాటు ప్రీమియం క్రోమ్ టచ్​ని తెస్తుంది. క్లాసిక్ 654 ఎంఎం సీట్ హైట్​తో రిలాక్స్​డ్​ ఎర్గోనామిక్స్, 16-ఇంచ్​ మెషిన్డ్ అల్లాయ్స్​ కలిగి ఉంది.

స్కౌట్ సిక్స్​టీ బాబర్ 649 ఎంఎం సోలో బాబర్-స్టైల్ సీటుతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది 16-ఇంచ్​ కాస్ట్ అల్లాయ్ వీల్స్​పై ప్రయాణిస్తుంది. బాబర్ సౌందర్యాన్ని నొక్కిచెప్పే మినిమలిస్టిక్ విధానాన్ని అందిస్తుంది. రెండు మోడళ్లలో 120 ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు ఉండగా, క్లాసిక్ 76 ఎంఎం డ్యూయల్ రేర్ షాక్​ అబ్సార్బర్స్​ని కలిగి ఉంది. బాబర్​కి ది 51 ఎంఎం. 

2025 ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ: కొత్త ఇంజిన్​..

2025 స్కౌట్ సిక్స్​టీ శ్రేణిలో రీడిజైన్ చేసిన స్పీడ్​ప్లస్​ 999 సీసీ ఇంజిన్ ఉంది. ఇది కొత్త రైడర్ల కోసం అప్రోచబుల్ పవర్ట్రెయిన్​ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లిక్విడ్ కూల్డ్ వీ-ట్విన్ ఇంజిన్​ 85 బీహెచ్​పీ పవర్​, 87 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీ-ట్విన్ 5-స్పీడ్ గేర్ బాక్స్​తో వస్తుంది. మల్టీ-ప్లేట్ క్లచ్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

2025 ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ: వేరియంట్లు..

బాబర్, క్లాసిక్ రెండూ.. స్టాండర్డ్ అండ్ లిమిటెడ్ అని పిలిచే రెండు వేరియంట్స్​లో  అందుబాటులోకి వస్తాయి. స్టాండర్డ్ వేరియంట్​తో రెండు మోడళ్లకు ఏబీఎస్ ఫంక్షనాలిటీ, ఎల్​ఈడీ లైటింగ్ ఉంది. ఈ బైక్లు రీజనరేటెడ్​ టెక్ సూట్ కోసం కొత్త ఫ్యూయల్ గేజ్​ని, పెద్ద బ్యాటరీని కలిగి ఉంటాయి. రెట్రో బైక్స్​ని అనలాగ్ క్లస్టర్​కు పరిమితం చేయడం జరిగింది. కానీ ఇండియన్ ఆప్షనల్ యాడ్-ఆన్​గా రైడ్ కమ్ టచ్​స్క్రీన్ డిస్​ప్లేను అందిస్తుంది.

ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్​, క్రూయిజ్ కంట్రోల్- ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. భిన్న రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా మూడు విభిన్న థ్రోటెల్ రెస్పాన్స్ కాన్ఫిగరేషన్లతో రైడ్ మోడ్లను ఈ వేరియంట్ల​లో ప్రామాణికంగా అందిస్తున్నారు. లిమిటెడ్ వేరియంట్లో ప్రత్యేకమైన 999 సీసీ ఇంజిన్, ఫ్రేమ్ బ్యాడ్జింగ్ ఉన్నాయి.

క్లాసిక్ ట్రిమ్​లో రెండు మోడళ్లు బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్​ను పొందుతుండగా, లిమిటెడ్ ప్రతిదానికి ఒక అదనపు ఆప్షన్​ని తీసుకువస్తుంది. ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ బాబర్ లిమిటెడ్ హెవీ మెటల్ కలర్ స్కీమ్​ని కలిగి ఉండగా, స్కౌట్ సిక్స్​టీ క్లాసిక్ ఫ్రాస్ట్ సిల్వర్ ఎంపికను పొందుతుంది. భారతదేశంలో రెండు మోడళ్ల ధరల వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్​ టైమ్​కి క్లారిటీ వస్తుంది.

Whats_app_banner