పవిత్ర కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి పురాణాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దేవతంలా కాశీకి వచ్చి అక్కడి గంగా నదిలో స్నానాలు ఆచరిస్తారనీ, అంతా కలిసి సంతోషంగా దీపాలు వెలిగించి గంగలో వదులుతారనీ హిందూ పురాణాలు చెబుతున్నాయి. దీన్నే దేవ్ దీపావళి లేదా దేవతల దీపావళి అని పిలుస్తారు. ప్రతి కార్తీక పౌర్ణమికి గంగా నదిలో స్నానం చేసి గంగలో దీప దానం చేస్తే నూటికి నూరు పాల్లు పుణ్య ఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబరు 15న వచ్చింది. ఈ రోజు దీపం దానం చేసేందుకు ఏయే సమయాల్లో శుభ ముహూర్తాలున్నాయో తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 15 శుక్రవారం ఉదయం 6.19 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16 తెల్లవారుజామున 2.58 గంటల వరకు కొనసాగుతుంది. అయితే పౌర్ణమి రోజున భద్ర నీడ కూడా ఉంటుంది. పంచాంగం ప్రకారం.. భద్ర పూర్ణిమ తిథి ప్రవేశంతో ఉదయం 0.19 నుండి ప్రారంభమవుతుంది, ఇది సాయంత్రం 4.38 వరకు ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం భద్ర పూర్ణిమి ఉండే ఈ రెండు గంటలు ఈ రోజు అశుభ సమయాలుగా పరిగణించాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు దీపం దానం చేసేందుకు ఉదయం మరియు సాయంత్రం కొన్ని శుభ ముహూర్తాలున్నాయి. అవేంటంటే..
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04.27 గంటల నుంచి 05.15 గంటల వరకు దీపం దానం చేసేందుకు శుభ సమయం.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11.07 నుంచి 11.50 గంటల వరకు దీప దాన మహోత్సవం జరుపుకోవచ్చు.
అమృత కాలం: సాయంత్రం 5.38 నుంచి 7. 03 గంటల వరకు దీపం దానం చేసేందుకు అత్యంత శుభ సమయం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శక్తి ఆలయం, ఖడేశ్వరి ఆలయం, భువనేశ్వరి ఆలయం, శివాలయం సహా అన్ని ఆలయాల్లో దీపదాన మహోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు తప్పకుండా దీపాలను వెలిగించడం, దీప దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు కలగుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం తులసి, విష్ణువు, శివుని ఆలయాన్ని సందర్శించి 11, 21, 51 దీపాలు దానం చేయడం వల్ల దేవతల ఆశీస్సులు లభించి ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
పౌర్ణమి రోజున, మతపరమైన కార్యక్రమాలు, పవిత్ర నదిలో స్నానం, పూజలు, దానధర్మాలు చేస్తారు. దానం చేయడం వల్ల భక్తులు పాపాల నుండి విముక్తి పొందుతారు. కార్తీక పూర్ణిమ నాడు ఏ పని తలపెట్టిన శ్రీమహావిష్ణువు అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల పాపాలు నశించి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మిక.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.