Suspense Thriller OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్!
Suspense Thriller OTT: మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కురుక్కు శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Suspense Thriller OTT: మలయాళం సస్పెన్స్ థిల్లర్ మూవీ కురుక్కు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. కురుక్కు మూవీ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 99 రూపాయలు రెంటల్‌గా చెల్లించాల్సివుంటుంది.
స్టార్ కాస్ట్ లేకుండా...
కురుక్కు మూవీలో అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జూన్‌లో ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కథ, కథనాలతో పాటు డైరెక్టర్ టేకింగ్ అద్భుతమంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఐఎమ్‌డీబీలో 10కిగాను 9.4 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్నది. కురుక్కు సినిమాలో నటించిన ఆర్టిస్టులు చాలా మంది కొత్తవారే కావడం గమనార్హం.
కురుక్కు కథ ఇదే...
క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా దర్శకుడు అభిజీత్ కురుక్కు మూవీని తెరకెక్కించాడు. రూబిన్, అతడి వైఫ్ స్నేహదారుణంగా హత్యకు గురువుతారు. వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కళ్లారా చూస్తాడు. కానీ మద్యం మత్తులో హంతకుడిని గుర్తుపట్టలేకపోతాడు.
అనుకోకుండా జార్జ్ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. పోలీస్‌లు మాత్రం జార్జ్ నిరపరాధి అని నమ్ముతారు. కానీ సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి? ఈ కేసును సజన్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు? అతడికి ఏసీసీ జాన్, డీసీపీ రామ్‌దాస్ ఎలాంటి సహాయం చేశారు? రూబిన్ , స్నేహలను హత్య చేసింది ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
గంట నలభై తొమ్మిది నిమిషాలు...
ఎలాంటి కామెడీ ట్రాక్‌లు, పాటలు లేకుండా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు కురుక్క మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా నిడివి కూడా గంట నలభై తొమ్మిది నిమిషాలే కావడం గమనార్హం. మలయాళంలో మీరా నాయర్ హెవెన్, తిమిరం, సిగయ్‌తో పాటు పలు సూపర్‌హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.