Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలకు వెళ్తే ఇవి తప్పనిసరి తీసుకెళ్లాలి-travancore devasthanam board advice devotees visiting sabarimala to bring aadhaar card ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలకు వెళ్తే ఇవి తప్పనిసరి తీసుకెళ్లాలి

Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలకు వెళ్తే ఇవి తప్పనిసరి తీసుకెళ్లాలి

Basani Shiva Kumar HT Telugu
Nov 14, 2024 11:20 AM IST

Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది. శబరిమలకు వచ్చే భక్తులు ఆన్‌లైన్‌ టైమ్‌ స్లాట్‌‌లో రిజిష్టర్ చేసుకోవాలని సూచించింది. అలాగే యాత్రకు వచ్చే భక్తులు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకురావాలని స్పష్టం చేసింది.

శబరిమల
శబరిమల

మండల - మకరవిళక్కు సందర్భంగా శబరిమల వచ్చే భక్తులు.. దర్శనం కోసం ముందుగానే ఆన్‌లైన్‌ టైమ్‌ స్లాట్‌ ద్వారా తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలని.. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కోరింది. టైమ్‌స్లాట్‌ దర్శనం, అక్కడ పాటించాల్సిన మార్గదర్శకాలను ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు.. అన్ని రాష్ట్రాలకు వివరించింది.

శబరిమలలో భక్తులు పాటించాల్సిన నిబంధనలను ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌ వెల్లడించారు. నిత్యం సన్నిధానానికి చేరుకునే భక్తుల సంఖ్య 70 నుంచి 80 వేల వరకు ఉంటుందని, ప్రవేశ ద్వారం నుంచి 10 వేల మందే సన్నిధానం చేరే వీలుందని వివరించారు. అందుకే ముందుగానే ఆన్‌లైన్‌ టైమ్‌స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని కోరారు. అలాగే.. భక్తులు తమ వెంట ఆధార్‌ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, విదేశీ భక్తులైతే పాస్‌పోర్టు కాపీని తీసుకురావాలని ట్రావెన్‌కోర్‌ బోర్డు స్పష్టం చేసింది.

భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు..

ఏపీ, తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈనెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.

1.ట్రైన్‌ నంబర్ 07131/07132 కాచిగూడ-కొట్టాయం రైలు నవంబర్ 17,24 తేదీల్లో కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మర్నాడు సాయంత్రం ఆరున్నరకు కొట్టాయం చేరుకుంటుంది.

ఈ రైలు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అవే స్టేషన్ల మీదుగా కాచిగూడకు వస్తుంది.

2. ట్రైన్‌ నంబర్‌ 07133/07134 కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ రైలు నవంబర్ 18,25 తేదీల్లో సోమవారం రాత్రి 8.50కు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొట్టాయం చేరుతుంది.

ఈ రైలు కాచిగూడ నుంచి షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పోడనూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలవా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా గమ్యస్థానం చేరుతుంది.

3. ట్రైన్ నంబర్ 07135/07136 హైదరాబాద్‌-కొట్టాయం-హైదరాబాద్‌ రైలు నవంబర్ 19, 26 తేదీలలో మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం నాలుగింటికి కొట్టాయం చేరుతుంది.

ఈ రైలు హైదరాాబాద్‌ నుంచి బయలుదేరి బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్‌, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

4. ట్రైన్ నంబర్ 07137/07138 సికింద్రాబాద్‌- కొట్టాయం-సికింద్రాబాద్‌ రైలు నవంబర్‌ 16, 23, 30వ తేదీల్లో ప్రతి శనివారం రాత్రి కొట్టాయంలో రాత్రి 9.45కు బయల్దేరి సోమవారం రాత్రి 12.50కు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌లో ఈ రైలు నవంబర్‌ 15,22, 29 తేదీల్లో బయలుదేరుతుంది.

ఈ రైలు సికింద్రాబాద్‌, మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది.

5. ట్రైన్‌ నంబర్ 07139/07140 నాందేడ్-కొల్లం-సికింద్రాబాద్‌ స్పెషల్ రైలు నవంబర్ 16న నాందేడ్‌లో, నవంబర్‌ 18న కొట్టాయంలో బయలుదేరుతుంది.

ఈ రైలు ముద్‌ఖేడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, అక్కన్నపేట, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్‌, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్‌, ఎట్టుమనూర్‌, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

6. ట్రైన్‌ నంబర్‌ 0714/07142 మౌలాలి-కొల్లాం-మౌలాలి రైలు నవంబర్‌ 23, 30 తేదీల్లో మౌలాలి నుంచి బయలుదేరుతుంది. కొల్లాంలో నవంబర్ 25న బయల్దేరుతుంది.

ఈ రైలు సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్‌, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిర్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్‌, ఎట్టుమనూర్‌, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Whats_app_banner