తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court On Paper Leak : పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించండి

TS High Court On Paper Leak : పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించండి

HT Telugu Desk HT Telugu

21 March 2023, 15:22 IST

  • TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ చేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (tshc )

తెలంగాణ హైకోర్టు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage) కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు(High Court) ఆదేశించింది. పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ చేసింది. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదన్న ఆధారాలను పిటిషనర్లు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. పేపర్ లీకేజీ కేసు స్టేటర్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల సమయాన్ని ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు చెప్పింది. పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని.. ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం(TS Govt) తరఫున ఏజీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఇతర నేతలు కూడా కోర్టుకు వచ్చారు. పేపర్ లీకేజీ మీద.. సమగ్ర విచారణ జరిపించాలని వివేక్ ధన్కా కోరారు. ఇద్దరు నిందితులకే సంబంధం ఉందని కేటీఆర్(KTR) చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసు మెుదటి దశలోనే.. ఇద్దరికే ప్రమేయం ఉందని ఎలా చెప్తారని అడిగారు. దర్యాప్తు విషయంలో ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదన్నారు.

ఒక మండలం నుంచి ఇరవై మందికి అధిక మార్కులు వచ్చాయని వివేక్ తెలిపారు. సీబీఐ(CBI) లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. గతంలో వ్యాపమ్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి ఇచ్చిందన్నారు. గ్రూప్ 1(Group 1) క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలను ఎందుకు రహస్యంగా పెడుతున్నారని అడిగారు. క్వాలిఫై అయిన వారి వివరాలు వెబ్ సైట్ లో ఎందుకు పెట్టలేదన్నారు.

ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని చెప్పారు. లీకేజీ కేసులో సిట్(SIT) సమగ్రంగా దర్యాప్తు జరుపుతోందన్నారు. ఇప్పటి వరకూ లీకేజీ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టుగా వెల్లడించారు. పిటిషనర్లు కేవలం ఇద్దరు అరెస్టు అయ్యారని అంటున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పేపర్ లీకేజీ కేసు విచారణనను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.