HC Rejects Avinash Plea: తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డికి చుక్కెదురు-telangana high court reject ys avinash reddy plea for relief in viveka murder case probe by cbi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hc Rejects Avinash Plea: తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డికి చుక్కెదురు

HC Rejects Avinash Plea: తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డికి చుక్కెదురు

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 11:28 AM IST

HC Rejects Avinash Plea: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్ట్‌ చేయకుండా ఉత్తర్వులివ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ విచారణలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది.

వైఎస్‌ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
వైఎస్‌ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

HC Rejects Avinash Plea: వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ విచారణ నుంచి ఉపశమనం కోరుతూ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. విచారణ సందర్భంగా తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సిబిఐను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిబిఐ విచారణపై స్టే ఇవ్వాలని అవినాష్ రెడ్డి చేసుకున్న పిటిషన్‌ ను హైకోర్టు తోసిపుచ్చింది.

సీబీఐ విచారణకు సహకరించాలని అవినాష్ రెడ్డికి హైకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా అరెస్ట్ చేయొద్దని తాము సిబిఐను ఆదేశించలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి హైకోర్టు అనుమతించింది. అవినాష్‌ పిటిషన్ సందర్భంగా సిబిఐ విచారణ లోఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో అవినాష్ రెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గత సోమవారమే విచారణ ముగిసింది. .ఇప్పటికే పలుమార్లు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ సిబిఐ వేధిస్తోందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

అవినాష్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు కేసు విచారణలో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా, ఇకపై విచారణకు పిలవకుండా ఆదేశాలివ్వాలంటూ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ తీర్పు వెలువరించారు.

గత సోమవారం ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులపై తీర్పును వాయిదా వేశారు. తుది ఉత్తర్వులు వెలువరించేదాకా అవినాష్‌రెడ్డిపై అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ మార్చి 13వ తేదీన సీబీఐని హైకోర్టు సోమవారం ఆదేశించింది.

మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను తెలంగాణ హైకోర్టుకు సీబీఐ అందించింది. హత్యకేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయీ నివేదికను, హార్డ్‌ డిస్క్‌ను, 10 కీలక డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలను, హత్య జరిగిన సమయంలో వివేకా రాసిన లేఖ, ఫోరెన్సిక్‌ పరీక్షల నివేదికలు, ఘటనా స్థలంలో ఆధారాలు చెరపక ముందు తీసిన ఫొటోలు, ఆధారాలు మాయం చేసిన తర్వాతి ఫోటోలు కేసు డైరీ తదితర వివరాలను సీల్డ్‌ కవర్‌లో సీబీఐ అందజేసింది.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు సిబిఐ సమర్పించిన ఆధారాలను వెనక్కి ఇవ్వడంతో పాటు దర్యాప్తు కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అవినాష్‌ రెడ్డి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Whats_app_banner