BJP Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం పై చార్ట్ షీట్ వేస్తామన్న సోము వీర్రాజు-ap bjp president somu veerraju says that party has getting stronger in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Bjp President Somu Veerraju Says That Party Has Getting Stronger In Andhra Pradesh

BJP Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం పై చార్ట్ షీట్ వేస్తామన్న సోము వీర్రాజు

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 01:57 PM IST

BJP Somu Veerraju: ప్రజాపోరు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వైసీపీ దుర్మార్గాలపై త్వరలో ఛార్జీషీట్ ప్రకటిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయిలో కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

పదాధికారుల సమావేశంలో సోమువీర్రాజు, బీజేపీ నాయకులు
పదాధికారుల సమావేశంలో సోమువీర్రాజు, బీజేపీ నాయకులు

BJP Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై త్వరలో చార్ట్ షీట్ వేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైన అంశంగా భావిస్తున్నామని, మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అనేక విధాలుగా సాయం అందించామని, వేల కోట్లు నిధులు ఇచ్చి అభివృద్ధి కి సహకరించామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీకి రాజకీయాలు ప్రధానం‌ కాదని, అభివృద్ధే ముఖ్యమని, రూ. 8లక్షల 16వేల కోట్లతో సబ్ కా సాత్ సబ్ కా‌వికాస్ పేరుతో అభివృద్ధిని ప్రోత్సహించామని స్పష్టం చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి , బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ ఇంఛార్జి అరవింద్ మీనన్, జాతీయ కార్యదర్శి, ఎపి సహా సునీల్ దేవదర్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇంచార్జ్ లు పాల్గొని పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రా రాజకీయాల్లో కీలకమైన తరుణంలో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రాజకీయాలకు కేంద్రం గా మారిందని, ఇంత ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోను లేదన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్నింటిలొ అవినీతి జరుగుతోందని ప్రజల వనరులను దోచుకుని దాచుకుంటున్నారని విమర్శించారు. ఆ డబ్బుతో రాజకీయం‌ చేసి ఓట్లు కొంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. అక్రమ సంపాదనతో ఓట్లు కొనాలని‌‌ చూస్తున్నారని, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లో‌ పదో తరగతి వాళ్లతో ఓట్లు‌ వేయించారని, ఇంత దిగజారి రాజకీయం‌ చేయడం దుర్మార్గం అని ఆరోపించారు.

బీజేపీ నాయకులు బూత్ లెవల్ లో కష్టపడి పని చేశారని, మోడీ తొమ్మిదేళ్ల‌ పాలనతో దేశ ప్రజలు, ప్రపంచ దేశాలు మెచ్చే విధంగాపని చేశారన్నారు. తాజాగా రాష్ట్రం లో వచ్చిన ఫలితాలు అంతి‌మం కాదని, గతంలో 1996లో ఎపిలో 16శాతం వస్తే, 1998లో 35శాతంతో రెండు ఎంపి సీట్లు సాధించామని, ఆ తరువాత ఒక్క శాతానికి పడిపోయినా, మళ్లీ‌ 14శాతానికి పెరిగిందని గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు 12 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, రెండో ప్రాధాన్యత ఓటు ను బిజెపికి‌ వేశారంటే మోడీ మీద అభిమానం ఉందని, ఈ పరిస్థితి ని అంచనా‌వేసి ఈ‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాల‌పై ప్రజల్లోకి‌ వెళ్లాలని పిలుపునిచ్చారు.

పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనలను అందరూ పాటించాలని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పై ఒక ఛార్జిషీటు తయారు‌చేయాలని, జగన్ వైఫల్యాలను, మోడీ‌ అభివృద్ధి ని ప్రజలకు వివరించే అజెండాతో ప్రజా పోరాటంతో ముందుకు వెళ్లాలని కోరారు. “ప్రజాపోరు” ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదామని పిలుపునిచ్చారు.

WhatsApp channel

టాపిక్