తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 20, 2024: Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్
Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్
Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్

Telangana News Live September 20, 2024: Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్

20 September 2024, 22:34 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

20 September 2024, 22:34 IST

Telangana News Live: Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్

  • హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురుసింది.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి. వచ్చే మూడో రోజులపాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 22:05 IST

Telangana News Live: Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవచ్చు

  • మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా పొందవచ్చు. ఐదేళ్లకు కలిపి చెల్లించాల్సింది కేవలం రూ. 100 మాత్రమే. ఈ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కార్డు పొందటం ఎలా..? వచ్చే బెనిఫిట్స్ వివరాలను ఈ కథనంలో చూడండి….
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 20:51 IST

Telangana News Live: TG Cabinet Decisions : హైడ్రాకు చట్టబద్ధత.. సన్నవడ్లకు రూ. 500 బోనస్, 3 వర్శిటీలకు కొత్త పేర్లు - కేబినెట్ నిర్ణయాలివే

  • Telangana Cabinet Key Decisions : తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైడ్రాకు విస్తృత అధికారులు కల్పించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 20:36 IST

Telangana News Live: Note For Vote Case : ఓటుకు నోటు కేసు విచారణ - వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ, ఏసీబీకి కీలక ఆదేశాలు

  • ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసులో ప్రతివాదిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ ప్రత్యేక ప్రాసిక్యూషన్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించింది.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 18:48 IST

Telangana News Live: TG Aarogyasri : క్యాడర్ మార్పుతో పాటు జీతం పెంపు - సమ్మె విరమించిన ఆరోగ్యమిత్రలు

  • రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో భాగంగా పని చేస్తున్న ఆరోగ్య మిత్రలు సమ్మె విరమించారు.  సమ్మెను విరమిస్తున్నట్లు  సంఘ ప్రతినిధులు లేఖను విడుదల చేశారు. ఆరోగ్యమిత్రల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దామోదర ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 17:23 IST

Telangana News Live: Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్‌

  • Dasara Bonus: సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి బోనస్‌ ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని రేవంత్ కొనియాడారు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 16:58 IST

Telangana News Live: Johnny Master Remand Report : రిమాండ్‌ రిపోర్టులో సంచలనం.. నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్!

  • Johnny Master Case : జానీ మాస్టర్ వ్యవహారంలో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. తాజాగా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జానీ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్‌‌ రిపోర్టులో ఉంది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 15:18 IST

Telangana News Live: Warangal Crime News : 'పుష్ప' స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్ - ఓరుగల్లు పోలీసులకు ఇలా దొరికిపోయారు..!

  • ఒడిశాలోని చితరకొండ ఏరియా నుంచి తెలంగాణకు తరలిస్తున్న గంజాయిని వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అనంతసాగర్​ క్రాస్​ వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ ట్రాక్టర్ ను తనిఖీ చేయగా…ట్రాలీ కింది భాగంలో గంజాయిని గుర్తించారు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 14:27 IST

Telangana News Live: Johnny Master Remand : చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్‌.. 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు

  • Johnny Master Remand : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 14:01 IST

Telangana News Live: TG ICET Counselling 2024 : తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - నేటి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే

  • TG ICET Counselling 2024 Updates :  టీజీ ఐసెట్ - 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.  సెప్టెంబర్ 21వ తేదీన ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 25వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://tgicet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 10:08 IST

Telangana News Live: Santoor Scholarship : విద్యార్థినులకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల స్కాలర్‌షిప్‌.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకొండి!

  • Santoor Scholarship : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ 9వ ఎడిషన్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు సపోర్ట్ చేయనుంది. స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థినులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 9:48 IST

Telangana News Live: Sangareddy Suicide: పనిచేసే ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తూ పట్టుబడి.. అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడు

  • Sangareddy  Suicide: నిచేస్తున్న కంపెనీలో ఉన్న చిన్న వస్తువు పై ఆశపడి, వాటిని దొంగతనంగా తీసుకెళ్తూ పట్టుబడ్డాడో ఆ ప్రైవేట్ ఉద్యోగి. తాను చేసిన తప్పుపని అందరికి తెలిసిందని అవమానంతో ప్రాణాలు తీసుకొని తన భార్య ఇద్దరు పిల్లల బతుకును రోడ్డున న పడేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 8:37 IST

Telangana News Live: Bandi Sanjay: విద్యార్థులతో మమేకమైన కేంద్ర మంత్రి బండి సంజయ్... సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు మందలింపు

  • Bandi Sanjay: అన్నంలో రాళ్ళు వస్తున్నాయి... టాయిలెట్ లో నీళ్ళు రావడం లేదు.. స్పోర్ట్స్ పీరియడ్ లో గేమ్స్ ఆడించడం లేదని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి పిర్యాదు చేశారు. పిల్లలతో మంత్రి మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి అధికారులను మందలించారు.
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 8:29 IST

Telangana News Live: Nalgonda BRS Office: పార్టీ ఆఫీస్ కూల్చొద్దు, ప్రజావసరాలకు ఉపయోగించుకోండి.. నల్గొండ బీఆర్ఎస్ నేతలు

  • Nalgonda BRS Office: " కోర్ట్ తీర్పును గౌరవిస్తాం. సుప్రీంకోర్టు లో అప్పీల్ చేస్తాం. అప్పటి వరకు ఆఫీసు కూల్చొద్దు. నల్గొండ లోని ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవని, ప్రజా అవసరాల కోసం బీఆర్ఎస్ ఆఫీసు ను ఉపయోగించాలని  నల్గొండ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 7:25 IST

Telangana News Live: Hydra Act: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ, హైడ్రాకు చట్టబద్దత దిశగా అడుగులు, హైడ్రాపై కీలక నిర్ణయం

  • Hydra Act: నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఆక్రమణల తొలగింపుపై హైడ్రా చేపట్టిన చర్యల్ని కొనసాగించడానికి వీలుగా  రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైడ్రా చట్టబద్దతపై  కోర్టు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

20 September 2024, 5:57 IST

Telangana News Live: TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలహాలం... పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు

  • TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ఎవరికి వారే ఓటర్ నమోదు ప్రక్రియతో మద్దతు కూడగట్టుకుంటున్నారు. క్లియరెన్స్ కోసం చూడకుండా ప్రచారం చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి