Telangana Cabinet Key Decisions : సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఖరారైంది.
మంత్రివర్గం నిర్ణయాలను మంత్రి పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… హైడ్రాకు చట్టబద్ధత కల్పించే విషయంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారు చేస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్కొన్నారు.