Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవచ్చు-all the white ration card holders can apply for labour insurance card ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవచ్చు

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu
Sep 20, 2024 10:14 PM IST

మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా పొందవచ్చు. ఐదేళ్లకు కలిపి చెల్లించాల్సింది కేవలం రూ. 100 మాత్రమే. ఈ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కార్డు పొందటం ఎలా..? వచ్చే బెనిఫిట్స్ వివరాలను ఈ కథనంలో చూడండి….

లేబర్ ఇన్సూరెన్స్ కార్డు
లేబర్ ఇన్సూరెన్స్ కార్డు

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ ఇన్సూరెన్స్ కార్డును పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ అవకాశం లేదు. ఏడాదికి రూ.22 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఐదు సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ డబ్బులను చెల్లించాలి. మొత్తం రూ. 110 అవుతుంది.

ముఖ్య వివరాలు:

  • లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న స్త్రీ. పురుషులు అర్హులు.
  • ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
  • రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ జత చేయాలి.
  • బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
  • ప్రయోజనాలు: పాలసీదారు సహజ మరణం పొందితే రూ. 1,30,000 అందుతాయి. అలాగే ప్రమాదవశాత్తూ మరణం జరిగే రూ. 6,00000 ఇన్సూరెన్స్ అందుతుంది.
  • ఒక ఇంట్లో ఇద్దరు అడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000 అందుకుంటారు.
  • ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు రూ. 30,000 చొప్పున వచ్చే అవకాశం ఉంది.
  • ఒక సంవత్సరం పాలసీ పొందిన తరువాత లబ్దిదారునికి ప్రమాదం జరిగి 50 శాతం దివ్యాంగుడిగా ఉంటే 2.50 లక్షలు అందుతాయి. అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
  • ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకేసారి 110/- రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/- రూ మాత్రమే.
  • ఈ కార్డు తీసుకోవాలనుకునే వారు మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్) లేదా ఎంపీడీఓ,,తహసీల్దార్ ను సంప్రదించవచ్చు.
  • ఈ పథకంలో చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులు అవుతారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం