LIVE UPDATES
CM Revanth Reddy : కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి
Telangana News Live October 5, 2024: CM Revanth Reddy : కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి
05 October 2024, 22:26 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: CM Revanth Reddy : కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth Reddy : మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. కేసీఆర్ ఫాం హౌస్ లో 500 ఎకరాలు భూదానం చేస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana News Live: Ponnam Prabhakar : మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక, సినిమా వాళ్ల దాడి సరికాదు? -మంత్రి పొన్నం
- Minister Ponnam Prabhakar: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా? ఇంత దాడి అవసరమా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు చెందిన మహిళా మంత్రి ఒంటరి కాదని స్పష్టం చేశారు.
Telangana News Live: PM Kisan Status Check : పీఎం కిసాన్ నిధులు విడుదల.. క్రెడిట్ అయ్యాయో.. లేదో.. ఈ లింక్ ద్వారా తెలుసుకోండి
- PM Kisan Status Check : పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదలయ్యాయి. మాహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. రైతులకు నగదు క్రెడిట్ అయ్యిందో లేదో pmkisan.gov.in లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Telangana News Live: Legitimacy for Hydra : హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల.. గవర్నర్ ఆమోదం.. 8 ముఖ్యాంశాలు
- Legitimacy for Hydra : హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ అంశంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Telangana News Live: Warangal : పరకాలలో అక్రమ దందాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్.. ఫైర్ క్రాకర్స్, పొగాకు ప్రొడక్ట్స్ స్వాధీనం
- Warangal : దసరా, దీపావళి సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ క్రాకర్స్ దందా జోరుగా నడుస్తోంది. పర్మిషన్లు లేకుండానే వివిధ రకాల టపాసులను గోదాముల్లో నింపేస్తున్నారు. హోల్ సేల్, రిటైల్ ధరలకు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దందాపై నిఘా పెట్టారు.
Telangana News Live: BRS vs Congress : కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర దీక్ష చేస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
- BRS vs Congress : రైతు రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. రుణమాఫీ కోసం రాహుల్ గాంధీ ఇంటి ఎదుట దీక్ష చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు. ఆయన కామెంట్స్‌పై తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. తాను కేసీఆర్ ఫాంహౌజ్ దగ్గర చేస్తానని ప్రకటించారు.
Telangana News Live: Bhupalpally News : షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఇల్లు, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కౌలు రైతు కుటుంబం
- Bhupalpally News : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో కౌలు రైతు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని దుస్తులు, నిత్యావసర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కట్టుబట్టలతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
Telangana News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 1284 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడవు..!
- TG Lab Technician Recruitment 2024 : తెలంగాణలోని వైద్యారోగ్యశాఖ నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా గత నెలలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు ఇవాళ్టి(అక్టోబర్ 5)తో ముగియనున్నాయి.
Telangana News Live: TG Govt Schemes : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరొ పథకం.. ఆ సమస్యలకు పరిష్కారం!
- TG Govt Schemes : తెలంగాణ రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలతో రైతులు బాధలు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. వారికి మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు. త్వరలోనే భూమాత పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
Telangana News Live: Nizamabad : ఎంత విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య
- Nizamabad : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఆన్ లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకొని.. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telangana News Live: Hyderabad : నలుగురు మేయర్లు.. 4 కార్పోరేషన్లు.. మారనున్న హైదరాబాద్ రూపురేఖలు!
- Hyderabad : జీహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి.. హైదరాబాద్‌ను మొత్తం 4 కార్పేషన్లుగా విభజిస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగిన తర్వాత నలుగురు మేయర్లను ఎన్నుకుంటారని వివరించారు.
Telangana News Live: KU Distance Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - మరోసారి అప్లికేషన్ల గడువు పొడిగింపు
- Kakatiya University Distance 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా…అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అప్లికేషన్ల గడువును అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు చూడొచ్చు.
Telangana News Live: Medak Crime News : యూట్యూబ్ లో చూసి అతి పురాతన పార్శ్వనాథుడి విగ్రహం చోరీ - ఏపీ బీటెక్ విద్యార్థులు అరెస్ట్..!
- యూట్యూబ్ లో సమాచారం తెలుసుకొని అతి పురాతన పార్శ్వనాథుడి విగ్రహాన్ని కొందరు యువకులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం అందటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Telangana News Live: Farmers protest : ఎన్నికల హామీలను అమలు చేయాలి..! జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు
- జగిత్యాల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. శుక్రవారం భారీ ర్యాలీతో కలెక్టరేట్ ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది
Telangana News Live: Telangana Sports University : 70 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్శిటీ - 14 క్రీడలకు ప్రత్యేక హబ్, కీలక ఆదేశాలు
- Telangana Sports Policy : కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. స్పోర్ట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని.. స్వయం ప్రతిపత్తి కూడా ఉండాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలోనే వర్శిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.