TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 1284 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
TG Lab Technician Recruitment 2024 : తెలంగాణలోని వైద్యారోగ్యశాఖ నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా గత నెలలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు ఇవాళ్టి(అక్టోబర్ 5)తో ముగియనున్నాయి.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 21 నుంచి నడుస్తోంది. అప్లికేషన్ల గడువు ఇవాళ్టి(అక్టోబర్ 5)తో పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
1284 ఉద్యోగాలు - ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఇందులో చూస్తే ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు ఉన్నాయి. ఇక వైద్య విధానపరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులును భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
నవంబర్ 10న రాత పరీక్ష….
ఆన్‌లైన్ దరఖాస్తులు ఇవాళ సాయంత్రం 5 గంటలతో పూర్తి అవుతుంది. ఇక అక్టోబర్ 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. నవంబర్ 10వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆన్‌లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Click here to apply for the post of Lab-Technician Grade-II new అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా మీ ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- ఇందుకు మీ విద్యార్హతలతో పాటు ఆధార్ కార్డు. పారా మెడికల్ బోర్డ్, తెలంగాణ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో పాటు మరిన్ని వివరాలను ఎంట్రీ చేయాలి.
- చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నెంబర్ కు గుర్తు పెట్టుకోవాలి. హాల్ టికెట్ల డౌన్లోడ్ తో పాటు ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉపయోగపడుతుంది.