తెలుగు న్యూస్ / తెలంగాణ /
KU Distance Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - మరోసారి అప్లికేషన్ల గడువు పొడిగింపు
Kakatiya University Distance 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా…అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అప్లికేషన్ల గడువును అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు చూడొచ్చు.
కేయూ దూర విద్యలో ప్రవేశాలు 2024 (image source from http://sdlceku.co.in/index.php )
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… సెప్టెంబర్ 30వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు గడువు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ముఖ్య వివరాలు:
- డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషయాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీతో పాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.
- 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
- సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యూకేషన్, కాకతీయ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
- యూజీ కోర్సులు మూడేళ్లు ఉంటాయి. పీజీ రెండేళ్లు, డిప్లోమా కోర్సుల వ్యవధి ఏడాదిగా ఉంటుంది.
- యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి.
- పూర్తి చేసిన దరఖాస్తులను వరంగల్ లో ఉన్న స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ కేంద్రంలో సమర్పించాలి.
- కోర్సు ఫీజును ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లోనైనా చెల్లించవచ్చు.
- ఈసారి మొత్తం 33 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- సంప్రదించాల్సిన ఫొన్ నెంబర్లు - 0870 - 2461480, 0870 -2461490.
- దరఖాస్తులకు తుది గడువు: 15 అక్టోబర్, 2024.
- దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/UG-PG-Notification.php
- అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php
- మెయిల్ - info@sdlceku.co.in
- డిగ్రీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/pdf/UG-2024.pdf
- పీజీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/pdf/PG-2024.pdf
మరోవైపు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తో పాటు అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో కూడా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో దరఖాస్తుల గడువు అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.