Legitimacy for Hydra : హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల.. గవర్నర్ ఆమోదం.. 8 ముఖ్యాంశాలు
Legitimacy for Hydra : హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ అంశంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు తాజాగా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది.
1. జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
2.హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది చట్టబద్ధమైనదే. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని రంగనాథ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
3. వీలైనంత త్వరగా అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది అని రంగనాథ్ స్పష్టం చేశారు.
4. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో 99పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
5. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చి జీవో 99 చట్టబద్ధతను సవాలు చేస్తూ.. హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు.
6. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసేదాకా జీవో అమలును నిలిపిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
7. హైడ్రాకు చట్టబద్ధత వెనుక కేంద్రం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. బీజేపీ పెద్దల సూచనతోనే గవర్నర్ హైడ్రాకు చట్టబద్ధత కల్పించారని అన్నారు.
8. మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్ పెట్టింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.