తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 11, 2024: Telangana Caste Census : తెలంగాణలో స‌మ‌గ్ర కుల‌ గ‌ణ‌న‌ - 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్త‌ర్వులు జారీ
Telangana Caste Census : తెలంగాణలో స‌మ‌గ్ర కుల‌ గ‌ణ‌న‌ - 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్త‌ర్వులు జారీ
Telangana Caste Census : తెలంగాణలో స‌మ‌గ్ర కుల‌ గ‌ణ‌న‌ - 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్త‌ర్వులు జారీ

Telangana News Live October 11, 2024: Telangana Caste Census : తెలంగాణలో స‌మ‌గ్ర కుల‌ గ‌ణ‌న‌ - 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్త‌ర్వులు జారీ

11 October 2024, 22:26 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

11 October 2024, 22:26 IST

Telangana News Live: Telangana Caste Census : తెలంగాణలో స‌మ‌గ్ర కుల‌ గ‌ణ‌న‌ - 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్త‌ర్వులు జారీ

  • Caste Census in Telangana : కుల గణనపై తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. 60 రోజుల గడువుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 19:00 IST

Telangana News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 371 ఖాళీల భర్తీకి ప్రకటన, వివరాలివే

  • రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. ఇందులో 272 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నాయి. మెడిక‌ల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వీటిని రిక్రూట్ చేయనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 18:01 IST

Telangana News Live: TG Vegetable Price : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలు

  • TG Vegetable Price : ఏం తినేటట్టు లేదు.,.ఏం కొనేటట్టు లేదు... నాగులో నాగన్న.. అనే పాట చందంగా మారింది మార్కెట్ పరిస్థితి. చౌకగా సరకులు తీసుకెళ్లాలని భావించిన పేదలు.. ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. పండగకు సరకులు కొనుగోలు చేద్దామని మార్కెట్‌కు వెళ్తున్న నిరుపేదలు.. వాటి ధరలు చూసి కంగుతింటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 17:43 IST

Telangana News Live: Hyderabad Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్.. పల్లె బాటపడుతున్న నగర వాసులు

  • Hyderabad Vijayawada Highway : హైదరాబాద్ నగర వాసులు పల్లెల బాట పడుతున్నారు. దీంతో నగరం అంతా నిర్మానుష్యంగా మారింది. వాహనాల రద్దీ బాగా తగ్గింది. ఇటు హైదరాబాద్ వెలుపల రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 17:18 IST

Telangana News Live: TG Young India Schools : నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

  • TG Young India Schools : తెలంగాణలో పలుచోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపనలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 16:33 IST

Telangana News Live: SCR Festival Special Trains 2024 : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి ప్రత్యేక రైళ్లు - ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు ఇవే

  • Dasara Diwali Special Trains 2024 : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. జల్నా - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 15:21 IST

Telangana News Live: Hyderabad Real Estate : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు కొంటున్నారా.. అయితే జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోండి!

  • Hyderabad Real Estate : హైదరాబాద్ పరిసరాల్లో భూములు ఉంటే అదో భరోసా. కుమారుడి చదువు కోసమో.. కూతురు పెళ్లి కోసమో పనికొస్తుందని చాలామంది అనుకుంటారు. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని భావిస్తారు. అలాంటి వారిని కొందరు ఈజీగా మోసం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 14:25 IST

Telangana News Live: Harish Rao : మరోసారి తెలంగాణకు గుండు సున్న.. కాంగ్రెస్, బీజేపీపై హరీష్ రావు సెటైర్లు

  • Harish Rao : కాంగ్రెస్, బీజేపీపై మాజీమంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మరోసారి తెలంగాణకు గుండు సున్న సాధించారని ఎద్దేవా చేశారు. పక్కనున్న ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉండే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 14:24 IST

Telangana News Live: TG LAWCET Counselling 2024 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 17 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలు

  • TG LAWCET Spot Admissions 2024 : తెలంగాణ లాసెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 17 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు కాలేజీల పేర్లతో పాటు సీట్ల వివరాలను వెల్లడించింది. 
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 13:47 IST

Telangana News Live: TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - పరీక్ష తేదీలపై కీలక ప్రకటన, హాల్ టికెట్లు ఎప్పుడంటే..!

  • TGPSC Group 3 Recruitment 2024 : తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు ఉంటాయని పేర్కొంది. వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. మోడల్ ఆన్సర్ బుక్ లెట్లను వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 13:19 IST

Telangana News Live: Kinnera Mogulaiah : అయ్యో పాపం.. మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చేసిన దుండగులు

  • Kinnera Mogulaiah : కిన్నెర మొగులయ్య.. అలియాస్ దర్శనం మొగులయ్య. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. అంత పేరున్నా.. కష్టాలు తక్కువేం కాదు. అందుకే ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. ఇంటి స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో ఇళ్లు కట్టుకుంటుంటే.. కొందరు దుండగలు కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 12:17 IST

Telangana News Live: Warangal : సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ఒకరు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి

  • Warangal : బతుకమ్మను గంగమ్మ ఒడికి పంపిద్దామని అందరూ ఆ ఊరి చెరువు గట్టుకు వెళ్లారు. అప్పటిదాకా అడిపాడారు. మహిళల బతుకమ్మ ఆటపాటలను చూసి ఆనందించిన ఓ వ్యక్తి.. బాబును ఎత్తుకొని ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అంతలోకి విధి కాటేసింది. కరెంట్ అతన్ని బలి తీసుకుంది. చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 11:37 IST

Telangana News Live: TG Liquor Sales : వామ్మో.. 9 రోజుల్లోనే రూ.713 కోట్ల మద్యం తాగేశారు.. బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ!

  • TG Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. దసరా పండగ నేపథ్యంలో.. కేవలం 9 రోజుల్లోనే 7 వందల కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగాయి. శుక్రవారం లిక్కర్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 10:39 IST

Telangana News Live: Hyderabad : నాంపల్లిలో దారుణం.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. భక్తుల ఆగ్రహం

  • Hyderabad : హైదరాబాద్ నాంపల్లిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులను శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 10:02 IST

Telangana News Live: Jagtial : జగిత్యాలలో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో నగలు, డబ్బు అపహరణ

  • Jagtial : పండగ పూట ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. జగిత్యాలలో ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు.. సుమారు 6 లక్షల రూపాయల విలువచేసే నగలు, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు.
పూర్తి స్టోరీ చదవండి

11 October 2024, 6:37 IST

Telangana News Live: Saddula bathukamma: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  • Saddula bathukamma: పూల పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు తొమ్మిది రోజులపాటు కన్నుల పండులా నిర్వహించారు. చివరిరోజు దుర్గాష్టమి రోజున తీరోక్కపూలతో నిలువెత్తు బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడి పాడారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి