TGPSC Group 3 Exam 2024 : తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష తేదీలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొంది. 17వ తేదీన ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ -2 ఉంటాయని వివరించింది. 18వ తేదీన చివరి పేపర్ పరీక్ష(ఉదయం 10 నుంచి 12.30 గంటలు) ఉంటుందని ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.
గ్రూప్ 3 పరీక్ష హాల్ టికెట్లపై కూడా టీజీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని వివరించింది. కమిషన్ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మోడల్ ఆన్సర్ బుకెలెట్ షీట్లను కూడా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం కొలువుల సంఖ్య 1,388 భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.