PSTU Admissions 2024 : అక్టోబర్ 3, 4 తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకొండి-potti sreeramulu telugu university entrance exam on october 3rd and 4th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pstu Admissions 2024 : అక్టోబర్ 3, 4 తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకొండి

PSTU Admissions 2024 : అక్టోబర్ 3, 4 తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకొండి

Basani Shiva Kumar HT Telugu
Sep 28, 2024 08:58 AM IST

PSTU Admissions 2024 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.. కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాట్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2024-25విద్యా సంవత్సరానికి.. వివిధ కోర్సులలో అక్టోబర్‌ 3, 4వ తేదీల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ భట్టు రమేశ్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బీఎఫ్‌ఏ శిల్పం, చిత్రలేఖనం, ఎంపీఏ నృత్యం, ఎంపీఏ జానపదం ప్రాయోగిక, ఎంఏ చరిత్ర, సంస్కృతి, పర్యాటకం కోర్సులకు, పీజీ డిప్లొమా, డిప్లొమా లలిత సంగీతం ప్రాయోగిక, సర్టిపికేట్‌ కోర్సులు యానిమేషన్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీల ప్రవేశ పరీక్షను 3న బాచుపల్లిలో నిర్వహిస్తామని వివరించారు.

ఎంఏ తెలుగు కోర్సుకు సంబంధించిన పరీక్షలను వరంగల్‌లో నిర్వహిస్తామని రిజిస్ట్రార్ వెల్లడించారు. ఎంఏ జ్యోతిష్యం, ఎంఏ కమ్యూనికేషన్‌ జర్నలిజం, ఎంఏ తెలుగు కోర్సుల ప్రవేశ పరీక్షను అక్టోబర్‌ 4న బాచుపల్లిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీఎఫ్‌ఏ ప్రాయోగిక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు డ్రాయింగ్‌ బోర్డు, పెన్సిళ్లను వారే తెచ్చుకోవాలని సూచించారు. శనివారం నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వెబ్‌ సైట్‌ www.pstu.cet.org ద్వారా హాల్‌ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్..

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన.. ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఐసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

మెరిట్ జాబితా విడుదల..

తెలంగాణలో మేనేజ్‌మెంట్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ జాబితాను.. కాళోజీ హెల్త్ వర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న 6,412 మంది, మెరిట్‌ జాబితాతో పాటు స్థానికతకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల ద్వారా అనుమతి పొందిన 45 మంది విద్యార్థుల మెరిట్‌ జాబితాను అధికారులు వెల్లడించారు. సింగరేణి కోటా కింద.. రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏడు ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. ఈ కోటా కింద 109 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు.