SCR Festival Special Trains 2024 : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి ప్రత్యేక రైళ్లు - ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు ఇవే-dussehra and diwali special trains between jalna tirupati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Festival Special Trains 2024 : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి ప్రత్యేక రైళ్లు - ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు ఇవే

SCR Festival Special Trains 2024 : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి ప్రత్యేక రైళ్లు - ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 11, 2024 04:48 PM IST

Dasara Diwali Special Trains 2024 : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. జల్నా - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది.

దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావాళ పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే చాలా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ క్రమంలోనే… తాజాగా మరోసారి ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. జల్నా - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. వివరాలు చూస్తే... జల్నా నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ఉంటుంది. అక్టోబర్ 13, 20, 27, నవంబర్ 11 తేదీల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఆదివారం 7.10 గంటలకు జల్నా నుంచి బయల్దేరి... మరునాడు సాయంత్రం 6.30 గంలటకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక తిరుపతి నుంచి జల్నాకు ప్రత్యేక ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ అక్టోబర్ 14, 21, 28తో పాటు నవంబర్ నవంబర్ 4వ తేదీన తిరుపతి నుంచి బయల్దేరుతుంది. రాత్రి 9.10 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 7 గంటలకు జల్నా చేరుతుంది.

ఆగే స్టేషన్లు ఇవే:

ఈ ప్రత్యేక రైళ్లు పతూర్, మన్వత్ రోడ్డు. పర్బాణీ, గంగాఖేర్, పర్లీ వజీనాథ్, లాథూర్ రోడ్డు, బాల్కీ, బీదర్, జహీరాబాజ్, వికారాబాద్, తాండూరు, చిత్తాపూర్, యాదిగిర్, రాయిచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రేణిగుంట స్టేషన్లల్లో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు.

భద్రాచలానికి ప్రత్యేక రైళ్లు - 95 సర్వీసులు

మరోవైపు బెల్గావి - మణుగూరు మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ వరకు ఈ ట్రైన్ నడుస్తుందని వెల్లడించింది. ఈ ట్రైన్ ఆది, బుధ, శనివారం, మంగళవారం తేదీల్లో మధ్యాహ్నం 12. 30 గంటలకు బెల్గావి నుంచి బయల్దేరుతుంది. మరునాడు 12.50 గంటలకు మణుగూరుకు చేరుతుంది.

ఇక మణుగూరు -బెల్గావి మధ్య కూడా స్పెషల్ ట్రైన్ నడవనుంది. అక్టోబర్ 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు మొత్తం 95 సర్వీసులు నడుస్తాయని వివరించింది. ఈ రైళ్లు...ఖానాపూర్, అలన్వార్, హుబ్లీ, కొప్పల్, హోసిపేట్, బల్లారి, గుంతకల్, ఆదోని, కోస్లీ, మంత్రిలాయం, యాద్గిర్, చిత్రపుర్, తాండూర్,వికారాబాద్, లింగపల్లి, బేగంపట్, సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాద్, డోర్నకల్, భద్రాచంల స్టేషన్లలో ఆగుతాయి.

Whats_app_banner