తెలుగు న్యూస్ / తెలంగాణ /
TG LAWCET Counselling 2024 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 17 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలు
TG LAWCET Spot Admissions 2024 : తెలంగాణ లాసెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 17 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు కాలేజీల పేర్లతో పాటు సీట్ల వివరాలను వెల్లడించింది.
తెలంగాణ లాసెట్ అడ్మిషన్లు 2024
రాష్ట్రంలో లాసెట్ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే రెండు విడతల్లో సీట్ల కేటాయింపు జరగా… తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్లుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 17 నుంచి స్పాట్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు, సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. ఈ మేరకు పూర్తి వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.
17 నుంచి స్పాట్ అడ్మిషన్లు…
- ఎల్ఎల్ బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.
- అక్టోబర్ 17వ తేదీ నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
- ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అవుతుంది.
- మొత్తం 23 కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలు ఉంటాయి.
- కాలేజీల వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ లింక్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
- ధ్రువపత్రాల పరిశీలన తర్వాత సంబంధిత కాలేజీకి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది.
- ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- స్పాట్ అడ్మిషన్లలో కూడా లాసెట్ ర్యాంక్ కార్డు కీలకంగా ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
- స్పాట్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ లింక్స్ : https://lawcetadm.tsche.ac.in/spot/info/index?cc=collegecode
కావాల్సిన ధ్రువపత్రాలు :
- టీజీ లాసెట్ ర్యాంక్ కార్డు - 2024
- పదో తరగతి మెమో
- ఇంటర్మీడియట్ మెమో
- డిగ్రీ ఒరిజినల్ మెమో
- స్టడీ సర్టిఫికెట్స్
- టీసీ
- కుల ధ్రువీకరణపత్రం
- రెసిడెన్స్ సర్టిఫికెట్
ఇక ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
టీజీ లాసెట్ ర్యాంక్ కార్డు 2024:
- తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.