TG ICET Spot Admissions : ఈ నెల 15, 16న టీజీ ఐసెట్ స్పాట్ అడ్మిషన్లు, అవసరమయ్యే సర్టిఫికెట్లు ఇవే
TG ICET Spot Admissions : తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. రేపు స్పాట్ అడ్మిషన్ల పై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ సీట్ల సీట్ల వివరాలను ఇప్పటికే వెబ్ సైట్ లో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో ఐసెట్ స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు స్పాట్ అడ్మిషన్ల పై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ సీట్ల సీట్ల వివరాలను ఇప్పటికే వెబ్ సైట్ లో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
యూనివర్సిటీల్లో, ప్రైవేట్ అన్ ఎయిడెట్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
- కళాశాలలు, కోర్సుల వారీగా / కేటగిరీల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలు 09-10-2024న https://tgicet.nic.in వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
- ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థులను స్పాట్ అడ్మిషన్లకు అనుమతించరు.
- స్పాట్ అడ్మిషన్ల కోసం అభ్యర్థి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
- వెరిఫికేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి అభ్యర్థికి ఇచ్చేస్తారు.
- అభ్యర్థి ఒక సెట్ జిరాక్స్ కాపీ సర్టిఫికెట్లు, ఒరిజినల్ బదిలీ సర్టిఫికేట్ అందజేయాలి.
- స్పాట్ అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
ముఖ్య తేదీలు
- స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ తేదీ : 09-10-2024
- కళాశాల నోటీసు బోర్డులో ఖాళీల వివరాలను ప్రదర్శించే తేదీ (https://tgicet.nic.in వెబ్‌సైట్‌లో ఇప్పటికే విడుదల చేశారు) : 09-10-2024
- కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు : 15-10-2024 నుంచి 16-10-2024 వరకు
స్పాట్ అడ్మిషన్ల కోసం సమర్పించాల్సిన సర్టిఫికెట్లు
i. ఒరిజినల్ SSC మార్క్స్ మెమో
ii. ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఒరిజినల్ మార్కుల మెమో
iii. డిగ్రీ లేదా దానికి సమానమైన ఒరిజినల్ మార్కుల మెమో
iv. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ డిగ్రీలకు సంబంధించి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈక్వివలెన్సీ సర్టిఫికేట్ అవసరం
v. ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు
vi. TGICET- 2024 ర్యాంక్ కార్డ్, క్వాలిఫై అయితే
vii. కుల ధృవీకరణ పత్రం(వర్తిస్తే)
viii. నివాస ధృవీకరణ పత్రం(వర్తిస్తే)
ప్రాసెసింగ్ ఫీజు
- TGICET-2024 అర్హత పొందిన అభ్యర్థులు : రూ. 1300/-
- TGICET-2024 అర్హత లేని అభ్యర్థులు : రూ. 2100/-
బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని.. యూనివర్సిటీ అధికారులు సూచించారు. https://tsparamed.tsche.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
తెలంగాణలో వరుసగా నాలుగేళ్ల పాటు చదివిన వారే రిజిస్ట్రేషన్ చేసుకోవాడనికి అర్హులని యూనివర్సిటీ అధికారులు వివరించారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేశారు. జనరల్ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40, దివ్యాంగులకు 45 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ https://www.knruhs.telangana.gov.in/all-notifications/ ను సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం