TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 371 ఖాళీల భర్తీకి ప్రకటన, వివరాలివే-a notification has been released for filling up 371 more posts in the telangana health department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 371 ఖాళీల భర్తీకి ప్రకటన, వివరాలివే

TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 371 ఖాళీల భర్తీకి ప్రకటన, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 11, 2024 07:04 PM IST

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. ఇందులో 272 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నాయి. మెడిక‌ల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వీటిని రిక్రూట్ చేయనున్నారు.

371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌
371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవలనే 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటన రాగా… తాజాగా మరో 371 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ పోస్టుల్లోఇందులో 272 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నాయి. 2050 పోస్టులకు ఈ కొత్త పోస్టులు కలిపి 2,322 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులు ఉండనున్నాయి. అక్టోబర్ 14 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఇటీవలనే 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు. ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ దరఖాస్తులను అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించాలి. అభ్యర్థులు తమ అప్లికేషన్లను అక్టోబర్ 16 ఉదయం 10.30 నుంచి 17వ తేదీ సాయంత్ర 5.00 వరకు సవరించుకోవచ్చు. సీబీటీ విధానంలో పరీక్షను నవంబర్ 17, 2024 నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థు బోర్డు వెబ్‌సైట్‌ https://mhsrb.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్ట్‌లకు సంబంధించి పే స్కేల్ రూ.36,750 – రూ.1,06,990 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు(80 మార్కులకు పరీక్ష నిర్వహణ), మిగిలిన 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలు(కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆసుపత్రులు/ సంస్థలు/ కార్యక్రమాలు) అందించిన వారికి కేటాయిస్తారు.

ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు. దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200 చెల్లించారు. అయితే దరఖాస్తు రుసుముపై వివిధ వర్గాలకు మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, తెలంగాణ మాజీ సైనికులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు గల తెలంగాణకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం